తోసుకుంటూ వెళ్లే బైక్ కు ఫైన్ : హెల్మెట్ ఏదంటూ ఎస్సై హల్ చల్

కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం పలు చిత్ర విచిత్రమైన ఘటనల గురించి వింటున్నాం. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపితే ఫైన్ పడుతుంది. ఈ విషయం తెలిసిందే. కానీ బైక్ ను నడుపుకుంటూ వెళ్లిన వ్యక్తికి పోలీసులు రూ1000 ఫైన్ వేసారు పోలీసులు. పైగా ఆ బైకుకు ఇంజన్ కూడా పనిచేయటంలేదు. దీంతో వామ్మో ఏందీ ఫైన్ అంటూ బిత్తరపోయాడు సదరు బైక్ కు సంబంధించిన వ్యక్తి. ఈ ఘటన తమిళనాడు కడలూరు జిల్లాలో జరిగింది.
కడలూరు జిల్లా సేత్తియాతోపు గ్రామానికి చెందిన తంగదురై అనే యువకుడి మోటార్ సైకిల్ కు రిపేర్ వచ్చింది. రిపేర్ కోసం సోమవారం (నవంబర్ 13)ఉదయం మెకానిక్ షాపు కు తీసుకెళ్లాడు. బైక్ పరిశీలించిన మెకానిక్ ఇంజిన్ విప్పాలనీ చెప్పాడు. సరేనన్నాడు మెకానిక్ బైక్ ఇంజన్ విప్పేయగా..ఇంజన్ లేని బైకు శుభ్రం చేసేందుకు తంగదురై నెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో శక్తివేల్‌ను ఎస్‌ఐ బృందం ఆపారు. బైక్ సంబంధించిన పేపర్లు..చూపించమనీ..హెల్మెట్ ఎక్కడ? అంటూ ప్రశ్నిస్తూ..రూ.వెయ్యి జరిమానా కట్టమన్నాడు. దీంతో తంగదురై బిత్తరపోయాడు.
బైక్ పాడైపోయింది. రిపేర్ కోసం బైక్ ఇంజన్ మెకానిక్ కు ఇచ్చాను. ఇంజిన్ లేని మోటార్ సైకిల్‌ను తోసుకొచ్చానని..,దీనికి జరిమానా ఎందుకు కట్టాలని ప్రశ్నించాడు. దీంతో ఎస్‌ఐ టీమ్..ఫైన్ కట్టాల్సిందేనన్నారు. దీంతో తంగదురై ఏమీ చేయలేక.. ఎలక్ట్రానిక్ మెషిన్ రశీదు ఇస్తే ఫైన్ డబ్బులు కడతాను అన్నాడు. దీంతో ఎస్సై ఆగ్రహం వ్యక్తరం చేస్తూ..ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడాడు. ఇంతా తంగదురై తన ఫోన్ లో షూట్ చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది డీఎస్పీ దృష్టికి వెళ్లటంతో ఎస్‌ఐ తీరుపై డీఎస్పీ జవహర్‌లాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీంతో మెమో జారీ చేశారు. కాగా…తోసుకుంటూ వెళ్లే బైకు ఫైన్ వేసిన ఆ ఎస్‌ఐ మరో రెండు నెలల్లో రిటైర్ అవ్వనున్నాడు.