కరోనా ఎఫెక్ట్: పనికి రాకపోయినా వర్కర్లకు Tata ఫుల్ శాలరీ

టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వర్క ఫ్రమ్ హోమ్ చేసే హోదాలో ఉన్న వాళ్ల మాట సరే. మరి రోజు వారీ కూలీలు, శారీరక శ్రమ చేసే వారు తప్పనిసరిగా విధుల్లోకి రావలసిందే కదా. వీరందరికీ పనికిరాలేకపోయినా మార్చి, ఏప్రిల్ నెలల్లో పూర్తి జీతాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. వర్కర్లు క్వారంటైన్, ప్లాంట్ షట్‌డౌన్ ఇతర కారణాల కారణంగా ఆఫీసుకు రాలేకపోయినా పూర్తి జీతం ఇస్తామని హామీ ఇచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం సృష్టిస్తున్న కరోనాపై పోరాడేందుకు టాటా సన్స్ చైర్మ్ ఎన్ చంద్రశేఖరన్ శుక్రవారం ప్రకటన జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితులు సమాజంలోని సామాజికఆర్థిక అంశాలపై ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో పనిచేస్తున్న వారెవరికైనా కరోనా లక్షణాలు కనిపించి క్వారంటైన్ కు వెళ్తే పూర్తి జీతం ఇస్తాం.
సూక్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏవైనా.. మా పర్యవేక్షణలో నడిచే కంపెనీ ఏదైనా వెంటనే సెలవు ఇవ్వడంతో పాటు జీతాలు కల్పిస్తాం. ఈ జబ్బు గురించి పోరాడుతున్న సమయంలో ప్రతి రోజూ కీలకమైనదే. మనమంతా కలిసి ముకుమ్మడిగా పోరాడితే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సాధించగలం.
ఈ మేరకు టాటా కంపెనీ పెద్ద స్థాయిలో వర్క ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించింది. అత్యవసరమైతేనే ప్రయాణించమని మా ఉద్యోగులకు చెప్పాం. పరిస్థితి చక్కబడేంత వరకూ వస్తువుల డెలీవరీల్లోనూ జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇండియాలో ఈ ప్రమాదాన్ని అధిగమించాలని చేస్తున్న ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు.
Also Read | ఆయన చంద్రబాబు సమకాలికుడు, ఒకప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పారు, ఇప్పుడు అడ్రస్ వెతుక్కుంటున్నారు