CJI Chandrachud: టెక్నాలజీ తెలియదని మొబైల్ ఫోన్ వదిలేస్తారా?.. హైకోర్టు న్యాయమూర్తులకు సీజేఐ స్ట్రాంగ్ మెసేజ్

‘‘అట్టడుగు వర్గాల వరకు మని చేరాలి. అందుకు కోర్టుల్లో సాంకేతికత చేరాలి. టెక్నాలజీ తెలియదని మొబైల్ ఫోన్ వాడకం అయితే తగ్గట్లేదు కదా. అందుకే ఈ-కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం. విచారణ కోసం ఈ-సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇంటర్నెట్ యాక్సెస్ లేని న్యాయవాదులు ఈ-సేవా కేంద్రానికి వెళ్లి అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలను పొందవచ్చు’’ అని అన్నారు.

CJI Chandrachud: టెక్నాలజీ తెలియదని మొబైల్ ఫోన్ వదిలేస్తారా?.. హైకోర్టు న్యాయమూర్తులకు సీజేఐ స్ట్రాంగ్ మెసేజ్

‘Technology is here to stay, forever’, CJI Chandrachud tells High Court Chief Justices

Updated On : February 14, 2023 / 4:53 PM IST

CJI Chandrachud: కొన్ని హైకోర్టులు, ట్రిబ్యునల్‌లు వర్చువల్ హియరింగ్‌లను నిలిపివేస్తుండడంపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. టెక్నాలజీ తెలియదని కారణంతో వర్చువల్ హియరింగ్‌లను పక్కన పెట్టడం తగదని అన్న ఆయన అదే కారణంతో మొబైల్ ఫోన్ వదిలేయడం లేదనే విషయాన్ని గుర్తు చేశారు. కొంత మంది ఈ వర్చువల్ హియరింగ్‌లను కరొనా పాండమిక్ కోసం ఉద్దేశించిందనే అభిప్రాయంతో ఉన్నారని, వాస్తవానికి అది భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిందని సీజేఐ చంద్రచూడ్ అన్నారు.

Amit Shah: మొఘల్ వారసత్వాన్ని ఎవరూ చెరిపేయలేరు.. ఆసక్తికరంగా స్పందించిన అమిత్ షా

వర్చువల్ హియరింగ్‌లు ప్రాథమిక హక్కు అని ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సీజేఐ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానం తాజాగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ స్పందిస్తూ “హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులందరూ టెక్నాలజీ తెలుసుకోవాలి. మీకు ఇది అనుకూలంగా ఉందా లేదా అనేది విషయం కాదు. ప్రజా ధనం, ప్రజల అసవసరాల కోసం ఉన్న మనం, వారితో వ్యవహరించే విధానం ఇది కాదు. మౌలిక సదుపాయాల్ని అందుబాటులో ఉంచుకోవాలి. ఈ విషయంలో వారికి మినహాయింపులు లేవు” అని స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ “కొన్ని ట్రిబ్యునల్‌లు మహమ్మారి సమయం కోసమే సాంకేతికత అని చెప్పి వర్చువల్ హియరింగ్స్ రద్దు చేశాయి. సాంకేతికత అనేది మహమ్మారి కోసం కాదు. భవిష్యత్తు కోసం, మనం ప్రజలకు మరింత అందుబాటులో ఉండడానికి, ప్రజల్లో ఉండడానికి సాంకేతికత అవసరం’’ అని అన్నారు.

Kamalnath: వివాదాస్పద బాబాను కలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‭నాథ్

భౌతిక హాజరుపై న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం సహా మరి కొందరు న్యాయమూర్తులు, న్యాయవాదులు పట్టుబట్టారు. దీన్ని సీజేఐ తప్పు పట్టారు. ‘‘అట్టడుగు వర్గాల వరకు మని చేరాలి. అందుకు కోర్టుల్లో సాంకేతికత చేరాలి. టెక్నాలజీ తెలియదని మొబైల్ ఫోన్ వాడకం అయితే తగ్గట్లేదు కదా. అందుకే ఈ-కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం. విచారణ కోసం ఈ-సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇంటర్నెట్ యాక్సెస్ లేని న్యాయవాదులు ఈ-సేవా కేంద్రానికి వెళ్లి అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలను పొందవచ్చు’’ అని సీజేఐ అన్నారు.