Wanted Terrorist : పాక్ ఆక్రమిత కశ్మీరులో భారత్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం
పాక్ ఆక్రమిత కశ్మీరులో భారత్ వాంటెడ్ ఉగ్రవాదిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నిషేధిత లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న టాప్ టెర్రరిస్ట్ కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసిం హత్యకు గురయ్యారు.....

Wanted Terrorist
Wanted Terrorist : పాక్ ఆక్రమిత కశ్మీరులో భారత్ వాంటెడ్ ఉగ్రవాదిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నిషేధిత లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న టాప్ టెర్రరిస్ట్ కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసిం హత్యకు గురయ్యారు. (Terrorist Wanted By India Shot Dead) హతమైన ఉగ్రవాది లష్కరే తోయిబా చీఫ్ కమాండర్‌కు అత్యంత సన్నిహితుడు. (Pakistan-Occupied Kashmir) రియాజ్ అహ్మద్ జనవరి 1వతేదీన జరిగిన ధంగ్రీ ఉగ్రదాడి వెనుక ప్రధాన కుట్రదారుల్లో ఒకడు.
Brazil cyclone : బ్రెజిల్ దేశంలో భారీ తుపాన్…50 మంది అదృశ్యం
రాజౌరీ జిల్లా ధంగ్రీ గ్రామంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఏడుగురు మరణించగా, 13 మంది గాయపడ్డారు. జమ్మూ ప్రాంతానికి చెందిన అహ్మద్ 1999లో సరిహద్దుల వెంబడి పరార్ అయ్యాడు. తెల్లవారుజామున ప్రార్థనల సమయంలో రావలకోట్ ప్రాంతంలోని అల్-ఖుదుస్ మసీదులో గుర్తు తెలియని ముష్కరులు అహ్మద్‌ను కాల్చి చంపారని సమాచారం.
G20 Summit 2023 : మోదీ, జోబిడెన్ ద్వైపాక్షిక సమావేశంలో ఏఐ, సైన్స్, డిఫెన్స్ అంశాలపై చర్చ
అహ్మద్ ఎక్కువగా మురిడ్కేలోని లష్కరే తోయిబా బేస్ క్యాంప్ నుంచి పనిచేస్తున్నాడు. ఇటీవల రావలకోట్‌కు మారాడు. అతను లష్కరే తోయిబా చీఫ్ కమాండర్ సజ్జాద్ జాత్‌కు సన్నిహితుడు.