Australian Tough Decision : కరోనా ఎఫెక్ట్.. భారత్ నుంచి వెళ్లే ఆస్ట్రేలియన్లకు ఐదేళ్ల జైలు శిక్ష

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే తమ దేశ పౌరులపై వచ్చే తాత్కాలికంగా నిషేధం విధించింది.

Australian Tough Decision : కరోనా ఎఫెక్ట్.. భారత్ నుంచి వెళ్లే ఆస్ట్రేలియన్లకు ఐదేళ్ల జైలు శిక్ష

The Australian Government Has Taken A Tough Decision

Updated On : May 1, 2021 / 8:26 AM IST

Australian tough decision : భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే తమ దేశ పౌరులపై వచ్చే తాత్కాలికంగా నిషేధం విధించింది. భారత్ నుంచి వచ్చే ఆస్ట్రేలియన్లకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

భారత్ లో 14 రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు తమ దేశంలోకి అడుగు పెడితే ఐదేళ్ల పాటు జైలుశిక్ష లేదా 66 వేల డాలర్లు (సుమారుగా 49 లక్షల రూపాయలు) జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ నిబంధన శనివారం నుంచి అమలులోకి రానుంది. భారత్ లో కరోనా ఉధృతితో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. బయోసెక్యూరిటీ యాక్ట్ కింద చర్యలు చేపట్టింది.

భారత్‌లో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో సుమారు 9,000 మంది ఆస్ట్రేలియన్లు నివసిస్తున్నారని, వాళ్లలో దాదాపు 600 మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా చెబుతోంది. ఐపీఎల్‌లో పాల్గొనేందుకు ఇండియాకి వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లు, శిక్షణా సిబ్బందికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిబంధన నుంచి సడలింపు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా ఏప్రిల్‌ 27 నుంచి మే 15 వరకూ భారతదేశం నుంచి వచ్చే విమానాలను తాత్కాలికంగా నిషేధించిన విషయం తెలిసిందే. కఠినమై ఆంక్షల వల్ల అక్కడ కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 30 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకూ 29,779 కేసులు నమోదు కాగా 910 మరణాలు సంభవించాయి.