Viral Video: ఐడియా అదిరింది.. పెళ్లి వేడుక సజావుగా సాగింది.. వీడియో వైరల్

మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ పరదేశీ పురా ప్రాంతంలో ఒక పెళ్లి వేడుక అంగరంగ వైభంగా జరిగింది. బరాత్ ప్రారంభమైంది. రోడ్డుమీద పెళ్లి కూతురు వాహనంలో వెళ్తుంది. పక్కనే బంధువులు, స్నేహితులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున నడుచుకుంటూ, కొందరు డ్యాన్సులు చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది.

Viral Video: ఐడియా అదిరింది.. పెళ్లి వేడుక సజావుగా సాగింది.. వీడియో వైరల్

Viral Video (1)

Updated On : July 6, 2022 / 8:17 PM IST

Viral Video: మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ పరదేశీ పురా ప్రాంతంలో ఒక పెళ్లి వేడుక అంగరంగ వైభంగా జరిగింది. బరాత్ ప్రారంభమైంది. రోడ్డుమీద పెళ్లి కూతురు వాహనంలో వెళ్తుంది. పక్కనే బంధువులు, స్నేహితులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున నడుచుకుంటూ, కొందరు డ్యాన్సులు చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కురవడంతో పెళ్లి బృందానికి అద్భుతమైన ప్లాన్ తట్టింది.

Viral Video: ఇదేం డైనింగ్ టేబుల్ స్వామీ..! రోడ్డుమీదే తినుకుంటూ పోవచ్చు.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..

కొందరు యువకులు పక్కనే దుకాణంలోని టార్పలిన్ కవర్ ను తెచ్చారు. టార్పలిన్ కవర్ ను పట్టుకొని దాని కింద నడుచుకుంటూ బరాత్ లో పెళ్లి బృందం పాల్గొంది. ఈ ఘటనను స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీడియో వైరల్ గా మారింది. వీడియోలో వర్షంకు తడవకుండా చేతులు పైకెత్తి పట్టాను పట్టుకొని దానికింద వెళ్తున్నట్లు కనిపించింది. ఒక్కసారిగా చూస్తే పట్టా కదులుతుందా అన్నట్లు కనిపిస్తుంది.

Viral Video : గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్

ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వావ్ సూపర్ ఐడియా అంటూ కొందరు పేర్కొనగా.. వరుణుడు పెళ్లికి అంతరాయం కలిగించలేక పోయాడు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/ShailenderYadu/status/1544548061992853505?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1544548061992853505%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Foffbeat%2Fviral-video-baarat-battles-rain-moves-ahead-internet-says-happens-only-in-india-3132727