Tunnel Collapsed : మధ్యప్రదేశ్ లో కూలిన సొరంగం.. చిక్కుకుపోయిన కార్మికులు

సొరంగంలో పని చేస్తున్న 9 మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. వారిలో ఐదుగురు కార్మికులను రక్షించినట్లు వెల్లడించారు.

Tunnel Collapsed : మధ్యప్రదేశ్ లో కూలిన సొరంగం.. చిక్కుకుపోయిన కార్మికులు

Tunnel

Updated On : February 13, 2022 / 10:19 AM IST

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో సొరంగం కూలిపోవడవంతో పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. కట్ని జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది. దీంతో పలువురు కార్మికులు అందులో చిక్కుకుపోయారు. కట్నీ జిల్లా స్లిమ్నాబాద్‌లో నర్మదా వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా బార్గీ డ్యామ్‌ నుంచి బన్సాగర్‌ వరకు సొరంగం నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి సొరంగం కూలిపోయింది.

సొరంగంలో పని చేస్తున్న 9 మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. వారిలో ఐదుగురు కార్మికులను రక్షించినట్లు వెల్లడించారు. మరో నలుగురిని బయటకు తీసుకొచ్చేందుకు ఎస్‌డీఈఆర్ఎఫ్‌ బృందాలు చర్యలు ముమ్మరం చేశాయి. రెస్కూ ఆపరేషన్​ ఇంకా కొనసాగుతుందని కట్ని కలెక్టర్​ ప్రియాంక్ చెప్పారు.

Coronavirus India: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మూడో వేవ్ ముగుస్తోంది

ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న ఎస్‌డీఈఆర్ఎఫ్‌ సిబ్బందిని, జిల్లా అధికారులను సీఎం అభినందించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.