Viral Video: మాకివ్వాల్సింది మాకిచ్చేయ్.! లారీని ఆపి ఏనుగుల రుబాబు చూడండి.. వీడియో వైరల్

అటవీ ప్రాంతాల్లో లారీలు, ఇతర వాహనాల్లో ట్యాక్స్ చెల్లించకుండా అక్రమంగా సరుకు తరలిస్తున్నవారికి అడ్డుకట్ట వేసేందుకు చెక్ పోస్టుల వద్ద అధికారులు తనిఖీలు చేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏనుగులు ట్యాక్స్ వసూలు చేయడం మీరెప్పుడైనా చూశారా..? ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video: మాకివ్వాల్సింది మాకిచ్చేయ్.! లారీని ఆపి ఏనుగుల రుబాబు చూడండి.. వీడియో వైరల్

Elephant Tax

Updated On : July 24, 2022 / 8:14 PM IST

Viral Video: అటవీ ప్రాంతాల్లో లారీలు, ఇతర వాహనాల్లో ట్యాక్స్ చెల్లించకుండా అక్రమంగా సరుకు తరలిస్తున్నవారికి అడ్డుకట్ట వేసేందుకు చెక్ పోస్టుల వద్ద అధికారులు తనిఖీలు చేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏనుగులు ట్యాక్స్ వసూలు చేయడం మీరెప్పుడైనా చూశారా..? ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కేశవన్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే వేలాది మంది నెటిజన్లు ఏనుగుల రుబాబు ను చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tiger Crosses Road: నా దారి రహదారి.. నేనొస్తే సిగ్నల్ పడాల్సిందే..! రోడ్డుపై పులిదర్జా చూడండి..

ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కేశ్వన్ నిత్యం తన ట్విటర్ ఖాతాలో జంతువులకు సంబంధించిన పలు ఆశ్చర్యకరమైన వీడియోలను పోస్టు చేస్తుంటారు. తాజాగా ఏనుగులు లారీని ఆపి చెరకు గడలు తీసుకెళ్తున్న వీడియోను పోస్టు చేశారు. ‘మీరు ఇలాంటి పన్ను వసూలును ఏమని పిలుస్తారు’ అంటూ శీర్షకతో నెటిజన్లను ప్రశ్నించారు.

Arpita Mukherjee: మమత ప్రభుత్వంలో అర్పిత ముఖర్జీ పాత్ర ఏమిటి? మంత్రితో ఆమెకున్న సంబంధం అదేనా? ఈడీ ఏం చెబుతోంది..

ఈ వీడియోలో తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు అటవీ ప్రాంతంలో రహదారిపై చెరకు లోడుతో వెళ్తున్న లారీకి అడ్డంగా నిలబడి నిలిపేసినట్లు కనిపిస్తుంది. వీటిని గమనించిన లారీ డ్రైవర్ వెంటనే చెరకు లోడుపైకి ఎక్కి కొన్ని చెరకు గడలను కిందపడేయడం వీడియోలో చూడొచ్చు. అప్పుడు ఆ ఏనుగులు కిండపడేసిన చెరకు గడలను తొండంతో పట్టుకొని అడవిలోకి వెళ్లిపోతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఏనుగుల రుబాబును చూసి ఆశ్చర్య పోతున్నారు. కొందరు నెటిజన్లు.. అడవిలోకి కొత్త ట్యాక్స్ ఆఫీసర్లు వచ్చారోచ్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.