పవార్ పాలిటిక్స్: నాడు బాబాయ్.. నేడు అబ్బాయ్..

మహారాష్ట్రలో రాత్రికి రాత్రే రాజకీయాలు మారిపోయాయి. బీజేపీ మళ్లీ అధికారం చేజిక్కించుకుంది. ఎత్తులకు పై ఎత్తులు వేసి బీజేపీ శివసేనను సైడ్ చేసి అధికారంలోకి వచ్చేసింది. అయితే రాత్రికి రాత్రి మారిన రాజకీయాలు ఇలా ఉంటే ఇప్పుడు పవార్ అన్న కొడుకు అజీత్ పవార్ బీజేపీకి మద్దతు ఇచ్చి పార్టీలో చేరినట్లే ఇంతకుముందు కూడా శరద్ పవార్ సీఎం అయి ఉన్నారు. ఆ విషయాన్నే ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.
శరద్ పవార్ కూడా 1978లో అజిత్ పవార్ పంథాలోనే సీఎం పీఠమెక్కిన సంఘటన. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను చీల్చిన శరద్ పవార్ జనసంఘ్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇది పవార్ పాలిటిక్స్ అని, నాడు బాబాయ్.. నేడు అబ్బాయ్ పేరుతో మహారాష్ట్రలో అనుకుంటున్నారు. శరద్ పవార్‌ను అండర్ ఎస్టిమేట్ చేయడానికి ఏ మాత్రం వీలు లేదు. పదే పదే ఒక మాట చెబుతున్నాడూ అంటే, దానికి విరుద్ధంగా తెరవెనుక ఆచరణ జరిగుతున్నట్లే లెక్క.
ఇప్పుడు అజీత్ పవార్ కూడా అటువంటి స్టెప్పులే వేస్తున్నారు. బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు అంటూనే వెనుక కథ మొత్తం నడిపించేశాడు. శివసేనాని ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయిపోయినట్టేనని అనుకుంటున్న సమయంలోనే పార్టీకి ఝలక్ ఇచ్చాడు. కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన మూడు పార్టీలు కలిపుకుని కామన్ మినిమం ప్రోగ్రామ్ రూపొందగా, ఆ కూటమికి మహావికాస అఘాడి అని పేరు కూడా పెట్టుకుని, ఇక పీఠం ఎక్కడమే తరువాయి అనే క్రమంలో తెల్లారేసరికి సీన్ రివర్స్ చేసేశాడు ఈ అబ్బాయి అజీత్ పవార్.