Coronavirus live updates: కోవిడ్ ఫోర్త్ వేవ్.. ఢిల్లీలో లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. ఈ క్రమంలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉందనే వార్తలపై..

No Plan For Lockdown In Delhi
Coronavirus live updates: దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. కరోనా తీవ్రత పెరిగిపోతున్న క్రమంలో ఢిల్లీలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై శుక్రవారం (ఏప్రిల్ 2) మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలో ఎలాంటి లాక్ డౌన్ ప్లాన్ అమలు చేసేది లేదని స్పష్టం చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌తో సహా ఇతర శాఖ అధికారులతో అత్యవసర సమావేశమయ్యారు కేజ్రీవల్.. కరోనాను కట్టడి చేసే దిశగా యాక్షన్ ప్లాన్ అమలు చేయడంపై చర్చించారు.
ఢిల్లీ కరోనా కేసుల్లో నాల్గో వేవ్ లో అడుగుపెడుతోంది. రోజురోజుకీ కేసుల తీవ్రత తీవ్రస్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అయినా ఆందోళనక్కర్లేదన్నారు. కరోనా కట్టడి చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ముందుగా టెస్టింగ్, ట్రాకింగ్, ఐసోలేటింగ్ వంటి చర్యలపై తమ ప్రభుత్వం దృష్టిసారించనున్నట్టు పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందిగా సూచించారు.
అంతేకానీ, లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో నాల్గో వేవ్ మొదలైంది.. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 3,583 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఢిల్లీలో అన్ని స్కూళ్లను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేజ్రీవాల్ తెలిపారు. కరోనా కేసుల నేపథ్యంలో ఫిజికల్ క్లాసులు నిర్వహించేది లేదన్నారు. 9, 12 తరగతి విద్యార్థులకు మాత్రమే అకాడమిక్ గైడెన్స్ ద్వారా తరగతులు నిర్వహించనున్నారు.