సెప్టెంబర్ 30 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు

తిరుమలలో సెప్టెంబరు 30వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల తొలిరోజు సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భారీ భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. ఇక ఉదయం 9నుంచి 11గంటల వరకు, రాత్రి 8నుంచి 10గంటల వరకు స్వామి వాహనసేవలు జరగనున్నాయి.
సెప్టెంబర్ 24న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 29న ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. అక్టోబర్ 8 వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఆ 9 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేయనున్నారు. విఐపీ బ్రేక్ దర్శనాలు ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు మాత్రమే పరిమితం.
ఈ సందర్భంగా ఈవో సింఘాల్ మాట్లాడుతూ.. మాడవీధుల్లో 280 సీసీ కెమెరాలు, 4వేల 200 మంది పోలీసులు, 8వేల 300 వాహనాలు పార్కింగ్ చేసేలా భద్రత ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అంతేకాదు 37 ప్రాంతాల్లో LED స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.