Kerala : ఆలయంలో ఏనుగుకు కోపం వచ్చింది..సిబ్బందిని కిందపడేసి

తిరువిల్వమాల విల్వాద్రినాథ ఆలయంలో...కచ్చా సీవీలీ వేడుక జరుగుతోంది. ఈ సమయంలో...అదత్తు పరము అకా పనాచెర్రీ పరమేశ్వరమ్ అనే పేరు గల ఏనుగును అందంగా అలంకరించారు.

Kerala : ఆలయంలో ఏనుగుకు కోపం వచ్చింది..సిబ్బందిని కిందపడేసి

Kerala

Updated On : September 25, 2021 / 7:23 PM IST

Thiruvilwamala Elephant : ఏనుగులకు కోపం ఎప్పుడు వస్తుందో తెలియదు. కోపం వచ్చిందంటే..చాలు బీభత్సం సృష్టిస్తుంది. ఘీంకారాలు..పరుగులతో అందర్నీ భయకంపితులను చేసేస్తుంది. మనుషులను, జంతువులను..ఇతరత్రా వాటిని కిందపడేసి..తొక్కేస్తుంద. వీటి కారణంగా..పలువురు చనిపోయారు కూడా. తాజాగా..కేరళ రాష్ట్రంలోని ఓ ఆలయంలో.. సిబ్బందిని కిందపడేసి..చంపేసినంత పని చేసింది. వెంటనే అతను పరుగులు తీయడం, దాని కాలికి సంకెళ్లు ఉండడంతో అతను తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More : PM Modi At UNGA Summit : టీ స్టాల్ నుంచి ఐక్యరాజ్యసమితి ప్రసంగం దాకా..ప్రజాస్వామ్య బలం ఇదే

తిరువిల్వమాల విల్వాద్రినాథ ఆలయంలో…కచ్చా సీవీలీ వేడుక జరుగుతోంది. ఈ సమయంలో…అదత్తు పరము అకా పనాచెర్రీ పరమేశ్వరమ్ అనే పేరు గల ఏనుగును అందంగా అలంకరించారు. దీనిపై కునిసెరి స్వామి నాథన్ ఎక్కి కూర్చొన్నారు. అటూ..ఇటూ..తిరిగిన ఈ ఏనుగు..ఒక్కసారిగా కోపానికి గురైంది. తల అటూ ఇటూ..తిప్పుతూ…పైనున్న స్వామినాథన్ ను కింద పడేసింది.

Read More : Google: అదిరిపోయే కెమెరా ఫీచ‌ర్ల‌తో గూగుల్ ఫోన్లు

అమాంతం తొండంతో కొట్టేందుకు ప్రయత్నించింది. వెంటనే తేరుకున్న అతను..అక్కడి నుంచి పరుగులు తీశాడు. అక్కడున్న వారు కూడా భయాందోళనలకు గురయ్యారు. కాలికి సంకెళ్లు ఉండడంతో పెద్ద ప్రమాదమే తప్పిందంటున్నారు. చివరకు అటవీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. గంట పాటు శ్రమించి అనంతరం వారు చెప్పిన మాటలు విన్నది ఆ ఏనుగు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.