Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆ ముగ్గురు సీఎంల పాత్ర ఉంది..ఎవ్వరు తప్పించుకోలేరు : తరుణ్ చుగ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా రాజకీయ నేతలను హడలెత్తిస్తోంది. ఎప్పుడు ఎవరి పేరు వస్తుందోననే ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు పేర్లు వెల్లడయ్యాయి. ఈడీ, సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో ఈ స్కామ్ లో మూడు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంల పాత్ర కూడా ఉంది అంటూ బీజేపీ నేత తరుణ్ చుక్ చేసిన వ్యాఖ్యలు మరింత హీటెక్కిస్తున్నాయి.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆ ముగ్గురు సీఎంల పాత్ర ఉంది..ఎవ్వరు తప్పించుకోలేరు : తరుణ్ చుగ్

Those three CMs in Delhi Liquor Scam.. BJP leader Tarun Chugh’s key comments

Updated On : December 3, 2022 / 3:35 PM IST

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా రాజకీయ నేతలను హడలెత్తిస్తోంది. ఎప్పుడు ఎవరి పేరు వస్తుందోననే ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు పేర్లు వెల్లడయ్యాయి. ఈడీ, సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో ఈ స్కామ్ లో మూడు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంల పాత్ర కూడా ఉంది అంటూ బీజేపీ నేత తరుణ్ చుక్ చేసిన వ్యాఖ్యలు మరింత హీటెక్కిస్తున్నాయి.

ఈ స్కామ్ విషయంలో ఇప్పటికే తెలంగాణ, ఏపీల్లో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఈ కేసుకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీబీఐ నోటీసులు అందాయని వెల్లడించిన కవిత డిసెంబర్ 6న ఆమె సీబీఐ విచారణకు హాజరుఅవుతానని తెలిపారు. ఈ హీట్ కొనసాగుతున్న వేళ తెలంగాణ బీజేపీ ఇన్చార్జీ తరుణ్ చుగ్ మాట్లడుతూ..ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పంజాబ్, తెలంగాణ, ఢిల్లీ సీఎంల పాత్ర ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ మాఫియాతో దేశాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. చట్టం ముందు అందరూ సమానమేనని.., ఎవరూ చట్టానికి అతీతం కాదన్నారు.

ఢిల్లీ మద్యం పాలసీపై లోతైన దర్యాప్తు జరగాలని..చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. చట్టానికి చిన్నా పెద్దా..ఉన్నత కుటుంబంలో పుట్టినవారా? అనే తేడాలు ఉండవన్నారు. ఈ స్కామ్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొనేవారు ఆధారాలు నాశనం చేయటాని యత్నిస్తున్నారు. వారి ఫోన్లను కూడా దాచేస్తున్నారని కొంతమంది అయితే వారి ఫోన్లను ధ్వంసం చేశారు అంటూ వ్యాఖ్యానించారు.