పీఎం సీటుకు గండం: మోడీకి సవాళ్లు విసురుతున్న ముగ్గురు ఆడాళ్లు

పీఎం సీటుకు గండం: మోడీకి సవాళ్లు విసురుతున్న ముగ్గురు ఆడాళ్లు

Updated On : February 2, 2019 / 9:17 AM IST

2019 లోక్‌సభ ఎన్నికల్లో ముగ్గురు ఆడాళ్లు ప్రభంజనం సృష్టించనున్నారు. అధికారంలో ఉన్న మోడీ కంటే వారిపైనే జనాదరణ కనిపిస్తుండటంతో ప్రధాని సీటు ఈ సారి కూడా మోడీనే వరిస్తుందా అనే సందేహాలు నెలకొన్నాయి. మోడీకి పెను సవాళ్లు విసిరేందుకు ఆ ముగ్గురు మహిళా నేతలు సిద్ధమవుతున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసేందుకు నాయనమ్మ ఇందిరా గాంధీ వారసురాలిగా ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగనున్నారు. 

ప్రియాంక గాంధీ: 
ఎన్డీఏ ప్రభుత్వంలో శక్తివంతమైన నేతలున్నప్పటికీ ప్రత్యర్థిగా ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతుందంటే హడలే. పలు ప్రసంగాల్లో రాహుల్ గాంధీ అంతగా పేరు సంపాదించుకోలేకపోవడంతో ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో ఉందనగానే కాంగ్రెస్ అభిమానులు మరింత ఉత్తేజాన్ని పుంజుకున్నారు. కేవలం మతానికే ప్రాధాన్యమిస్తుందని పేరు తెచ్చుకున్న మోడీ ప్రభుత్వం.. ఇటీవల ముగిసిన ఎన్నికలలోనూ మతానికే ప్రాధాన్యమిచ్చే రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్‌లలోనూ తమ ఉనికిని చాటుకోలేకపోయింది. 

మాయావతి:
హిందూయిజంలో తక్కువ కులాలకు, దళితులకు ప్రాధాన్యతనిస్తూ సాగుతున్న మాయావతి బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారనుండటం ఖాయం. కాంగ్రెస్‌ వైపు అనుకూల పవనాలు వీస్తున్న బహుజన్ సమాజ్‌వాద్ పార్టీ అభ్యర్థిగా మాజీ టీచర్ అయిన మాయావతి పోటీ చేయనుంది. 

మమతా బెనర్జీ:
రెండు సార్లు ఫెడరల్ గవర్నమెంట్‌లో రైల్వే మంత్రిగా పని చేసిన మమతా బెనర్జీ.. 1997లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీను ఏర్పాటుచేశారు. అంతేకాదు ఇటీవల యాంటీ బీజేపీ ర్యాలీని కోల్‌కతాలో నిర్వహించి చాలా మందిని తమవైపుకు తిప్పుకోగలిగారు. 2011 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిని గల్లీ రాజకీయాలు చేసి చిత్తుగా ఓడించడంలోనే తెలుస్తోంది ఆమెలో ఉన్న రాజకీయ నైపుణ్యం. 

మోడీ ప్రభుత్వం మహిళాపరంగానూ బలంగానే కనిపిస్తుంది. ఆయనకు ఉన్న 26 మంది క్యాబినెట్‌లో  ఆరుగురు మహిళలే. ‘బేటీ బచావో, బేటీ పడావో’ అనే నినాదంతో పథకాన్ని ప్రవేశపెట్టిన మోడీ, ప్రభుత్వ మరుగుదొడ్లు, గ్యాస్ సిలెండర్లు పేదవారికి అందే యోచన కూడా చేశారు.