Delhi : ఆ రెజ్లర్లు తన రూ.50 లక్షలు కాజేశారని కేసు పెట్టిన పోలీసు అధికారి.. వాళ్లెవరంటే?

తన వద్ద నుంచి రూ.50 లక్షలు తీసుకుని రెజ్లర్లు రౌనక్ గులియా ఆమె భర్త అంకిత్ గులియా మోసం చేసారంటూ తీహార్ జైలు సూపరింటెండెంట్ దీపక్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే దారుణంగా మోసం చేసారని ఆరోపిస్తున్నారు.

Delhi : ఆ రెజ్లర్లు తన రూ.50 లక్షలు కాజేశారని కేసు పెట్టిన పోలీసు అధికారి.. వాళ్లెవరంటే?

Delhi

Updated On : August 29, 2023 / 4:07 PM IST

Delhi : ప్రొఫెషనల్ రెజ్లర్లు రౌనక్ గులియా ఆమె భర్త అంకిత్ గులియా తన వద్ద నుంచి రూ.50 లక్షలు మోసం చేసారని తీహార్ జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ దీపక్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని నమ్మి వ్యాపారంలో పెట్టుబడి పెడితే వారు దారుణంగా మోసం చేసారని ఆరోపిస్తున్నారు.

Cyber Fraud : సైబ‌ర్ నేర‌గాళ్ల ఘరాన మోసం.. ఏకంగా రిటైర్డ్ ఆర్మీ అధికారి నుంచి రూ. 3 ల‌క్ష‌లు కొట్టేశారు

ఆహార ఉత్పత్తుల బిజినెస్ పెడదామంటూ రెజర్లు రౌనక్ గులియా, ఆమె భర్త అంకిత్ గులియా తన వద్ద నుంచి రూ.50 లక్షలు మోసం చేశారని తీహార్ జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ దీపక్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిస్కవరీ ఛానెల్‌లోని ‘ఇండియాస్ అల్టిమేట్ వారియర్’ అనే రియాల్టీ షోలో జాతీయ, రాష్ట్ర రెజ్లింగ్ ఛాంపియన్ రౌనక్ గులియాను కలిశానని శర్మ తన ఫిర్యాదులో చెప్పారు. ఆమె రెజ్లర్ భర్త అంకిత్ హెల్త్ ప్రాడక్ట్స్ బిజినెస్ చేస్తున్నారని.. వారు పెట్టుబడిదారుల కోసం వెతుతున్న సమయంలో తనను కలిసారని వారి భారీ లాభాల వాగ్దానాలకు ఆకర్షితుడనై రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు శర్మ చెప్పారు. అయితే వారు తన డబ్బును తిరిగి ఇవ్వడానికి నిరాకరించినట్లు శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Cyber Fraud : పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ పేరుతో ఘరానా మోసం.. ఇన్ స్టాగ్రామ్ యాడ్ పై క్లిక్ చేసి రూ.10లక్షలకుపైగా పోగొట్టుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని

శర్మ ఫిర్యాదుపై ఢిల్లీలోని మధు విహార్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. దంపతుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. దీపక్ శర్మ, రౌనక్ గులియాలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. శర్మ ఇన్‌ఫ్లుయెన్సర్, ఫిట్ నెస్ ఔత్సాహికుడు. ఈయనను కాప్ యాక్షన్ సిరీస్ ‘దబాంగ్’ లోని సల్మాన్ ఖాన్ పాత్రతో తరచుగా పోలుస్తారు.