సైకిల్ కొందామని దాచుకున్న డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్ కి..బాలుడి ఉదారాత్వానికి సీఎం ఫిదా

తమిళనాడుకు చెందిన ఓ ఏడేళ్ల బాలుడి గొప్ప మనసుకు సాక్షాత్తు ముఖ్యమంత్రే ఫిదా అయ్యాడు.

సైకిల్ కొందామని దాచుకున్న డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్ కి..బాలుడి ఉదారాత్వానికి సీఎం ఫిదా

Tn Cm

Updated On : May 11, 2021 / 7:42 PM IST

TN CM తమిళనాడుకు చెందిన ఓ ఏడేళ్ల బాలుడి గొప్ప మనసుకు సాక్షాత్తు ముఖ్యమంత్రే ఫిదా అయ్యాడు. బాలుడి త‌ల్లిదండ్రుల‌కు సీఎం ఫోన్ చేసి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. బాలుడు ఉదారత్వానికి ముచ్చట పడ్డ ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ చిన్నారికి ఓ కానుక కూడా పంపారు.

అసలేం జరిగింది

మదురైకి చెందిన ఎలక్ట్రీషియన్ ఇళంగో,గీతల దంపతుల కుమారుడు హరీశ్ వర్మన్(7) సైకిల్ కొనుక్కోడానికి రెండేళ్ల నుంచి డబ్బులు దాచుకుంటున్నాడు. ప్రస్తుత కరోనా పరిస్థితులు గురించి టీవీలో వార్తలు చూసి ఆ చిన్నారి మనస్సు చలించిపోయింది. క‌రోనా రోగుల‌కు త‌న వంతు వారికి ఆర్థిక సాయం చేయాల‌ని వ‌ర్మ‌న్ నిర్ణ‌యించుకున్నాడు. దీంతో తాను దాచుకున్న డ‌బ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు అంద‌జేస్తూ సీఎంకు ఓ లేఖ రాశాడు వ‌ర్మ‌న్. ఈ సొమ్మును ఓ కోవిడ్ పేషెంట్‌ చికిత్సకు అందివ్వాలని తన లేఖలో పేర్కొన్నాడు. బాలుడు ఉదారస్వభావానికి సీఎం స్టాలిన్ తెగ ముచ్చటపడిపోయారు. ఆ పిల్లవాడికి సైకిల్‌ను బహుమానంగా పంపించారు.

ఈ సైకిల్‌ను మదురై నార్త్ ఎమ్మెల్యే కే దళపతి, డీఎంకే నాయకులు ఆ బాలుడికి అందజేశారు. తనకు సాక్షాత్తు ముఖ్యమంత్రే బహుమానం పండంతో బాలుడు ఆశ్చరానికి గురయ్యాడు. దానిని చూస్తూ తెగ సంబరపడిపోయాడు. అంతేకాదు ఆ బాలుడికి సీఎం స్టాలిన్ ఫోన్ చేశారు. నీకు సైకిల్ నచ్చిందా.. ఏం చదువుతున్నావు అని సీఎం ఆ బాలుడిని అడిగారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చాలా జాగ్రత్తగా ఉండాలని,బయటకు వెళ్లొద్దని.. బాగా చదువుకోవాలని ఆ బాలుడికి సీఎం స్టాలిన్ సూచించారు.