పోలీసంటే వీడేరా : దమ్ముంటే చెయ్యి వెయ్యరా..

కేరళలో బస్సులపై ఆందోళనకారులు దాడులకు దిగిన సమయంలో ఓ పోలీస్ విసిరిన సవాల్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 09:54 AM IST
పోలీసంటే వీడేరా : దమ్ముంటే చెయ్యి వెయ్యరా..

కేరళలో బస్సులపై ఆందోళనకారులు దాడులకు దిగిన సమయంలో ఓ పోలీస్ విసిరిన సవాల్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

కేరళ :  కేరళలో టెన్షన్ తగ్గలేదు. అయ్యప్ప వర్సెస్ కామ్రేడ్స్ మధ్య రాష్ట్రం రణరంగంగా మారింది. అయ్యప్ప శరణుఘోషలతో మారుమోగాల్సిన టైంలో.. నినాదాలతో హోరెత్తుతోంది. ఇందులో రాజకీయం కోణం ఉందా లేదా అనేది పక్కనపెడితే.. కేరళలో మొదలైన అల్లర్లు.. తమిళనాడుకి వ్యాప్తించాయి. ఈక్రమంలో తమిళనాడులో బస్సును ధ్వంసం చేసేందుకు వచ్చిన ఆందోళనకారులకు..బస్సు మధ్య నిలబడి ఓ పోలీస్ చేసిన సవాల్ ని అందరూ ప్రశంసిస్తున్నారు. ‘‘దమ్ముంటే చెయ్యి వెయ్యమని సవాల్ చేశాడు.. కేరళలో చేపట్టిన  ‘హర్తాల్’ సమయంలో బస్సులపై ఆందోళనకారులు దాడులకు దిగిన సమయంలో ఓ పోలీస్ చూపించిన తెగువ.. అడ్డుకున్న ఓ  వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇది చూసిన నెటిజన్స్ పోలీసంటే వీడేరా..పోలీస్ సింగం అంటే ఇతనే అంటు..తమిళనాడు పోలీసుపై ప్రశంసలు కురుపిస్తున్నారు. తమిళనాడు కేరళ బోర్డర్ లో వున్న కలైయక్కవిలై సరిహద్దుకు సమీపంలో కొందరు ఆందోళనకారులు బస్సులను ధ్వంసం చేసేందుకు యత్నించటంతో సబ్ ఇన్పెక్టర్ మోహన్ అయ్యర్ అడ్డుకున్నాడు. అంతే అయితే అతని గురించి మనం చెప్పుకోవాల్సిన పనిలేదు. అక్కడ ఆందోళనకారుల గుంపును కాల్చివేసిన వీడియో చిత్రీకరణ జరిగింది. వీడియోలో, అతను మాబ్ చెప్పడం కనిపిస్తుంది: “మీరు మనుష్యులైతే  బస్సుపై చేయి వేయండి చూద్దాం..కనీసం ముట్టుకోండిచూద్దాం’’ అంటు సవాల్ విసిరాడు. దీంతో వెనక్కి తగ్గిన ఆందోళనకారులు తోకముడిచి వెళ్లిపోవటంతో అక్కడే వున్న ప్రజలు  మోహన్ అయ్యర్ సాహసానికి చప్పట్లతో తమ అభినందనలను తెలిపారు. 

కాగా కేరళలో తలెత్తిన ఈ ఉద్రిక్తతలతో కేరళలో మంత్రులతో సహా వామపక్ష నేతల ఇళ్ళపై కూడా ఆందోళనకారులు బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ  క్రమంలో ఈ ఆందోళలు పక్క రాష్ట్రాలకు కూడా వ్యాపించాయి. ఆ హింసాకాండలో మోహన్ అయ్యర్ ధైర్యానికి నెట్టింట్లో కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని గమనించిన కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (KSRTC) మేనేజింగ్ డైరెక్టర్ తచ్కన్ ప్రశంసాపత్రంతో పాటు  1000 రూపాయల రివార్డ్ ఇచ్చి సత్కరించారు.