Gold Rate : శుభవార్త… మరోసారి తగ్గిన బంగారం ధర
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

Gold Rate
Gold Rate : గత రెండు రోజులుగా బంగారం ధర నేలచూపులు చూస్తోంది. బుధ గురువారాల్లో బంగారంపై రూ.400 లకు పైగా తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో దేశంలో కూడా దిగొస్తున్నాయి. ఇక వెండి కూడా బంగారం దారిలోనే నడుస్తోంది. వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. ఇక బంగారం విషయానికి వస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ.48,110కి తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.300 తగ్గి రూ.44,100కు క్షిణించింది.
వెండి ధర కూడా పడిపోయింది. కేజీ వెండిపై రూ.500 తగ్గింది. గురువారం కేజీ వెండి రూ.69,100గా ఉంది. వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.14 శాతం క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1791 డాలర్లకు తగ్గింది. వెండి రేటు కూడా దిగొచ్చింది. ఔన్స్‌కు 0.27 శాతం తగ్గుదలతో 23.98 డాలర్లకు క్షీణించింది.
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,120 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,120గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,520 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,570 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,350గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,110గా ఉంది.