Rahul Gandhi on India’s economy: ఇప్పుడు భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది: రాహుల్ గాంధీ

కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించిన సందర్భంగా కన్యాకుమారిలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ‘‘ఇప్పుడు భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భారత్ ఎన్నడూ ఎదుర్కోనంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగ రేటు ఉంది. దేశం విపత్తు దిశగా వెళుతోంది’’ అని రాహుల్ గాంధీ చెప్పారు.

Rahul Gandhi on India’s economy: ఇప్పుడు భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది: రాహుల్ గాంధీ

Rahul Gandhi on India's economy

Updated On : September 7, 2022 / 7:38 PM IST

Rahul Gandhi on India’s economy: కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించిన సందర్భంగా కన్యాకుమారిలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ‘‘ఇప్పుడు భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భారత్ ఎన్నడూ ఎదుర్కోనంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగ రేటు ఉంది. దేశం విపత్తు దిశగా వెళుతోంది’’ అని రాహుల్ గాంధీ చెప్పారు.

‘‘అప్పట్లో దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రించింది. ఇప్పుడు మూడు-నాలుగు సంస్థలు దేశం మొత్తాన్ని నియంత్రిస్తున్నాయి. మన త్రివర్ణ పతాకం ప్రతి మతానిది, రాష్ట్రానిది, భాషది. కానీ, అది ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడికి గురవుతోంది. మతం, భాషల ప్రాతిపదికన దేశాన్ని విడదీస్తున్నారు. దేశంలోని ప్రతి వ్యవస్థపై దాడి చేస్తున్నారు. దేశాన్ని ఏకం చేసేందుకు ప్రజలు సహకరించాలి’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

కాగా, కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ‘భారత్‌ జోడో యాత్ర’ 12 రాష్ట్రాల మీదుగా నిర్వహిస్తారు. 148 రోజుల పాటు 3500 కిలోమీటర్ల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రతి రోజు దాదాపు 25 కిలోమీటర్ల పాటు పాదయాత్ర నిర్వహిస్తారు.

Woman bites fingers: టీవీ సౌండు తగ్గించాలని చెప్పినందుకు అత్త చేతి మూడు వేళ్ళు కొరికేసిన కోడలు