Congress protest rally: నేటి ర్యాలీకి, 2024 లోక్‌సభ ఎన్నికల వ్యూహాలకు ఎలాంటి సంబంధమూ లేదు: జైరాం రమేశ్

ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ నేడు తలపెట్టిన నిరసన ర్యాలీకి, 2024 లోక్‌సభ ఎన్నికల వ్యూహాలకు ఎటువంటి సంబంధమూ లేదని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ అన్నారు. దేశంలో పెరిగిన నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం, జీఎస్టీ వంటి సమస్యలపై కాంగ్రెస్ ఈ నిరసన తెలుపుతోన్న విషయం తెలిసిందే. కేంద్ర సర్కారు తీరును ఎండగడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ఆ పార్టీ ముఖ్యనేతలు ఇందులో ప్రసంగించనున్నారు.

Congress protest rally: నేటి ర్యాలీకి, 2024 లోక్‌సభ ఎన్నికల వ్యూహాలకు ఎలాంటి సంబంధమూ లేదు: జైరాం రమేశ్

AICC President election

Updated On : September 4, 2022 / 12:32 PM IST

Congress protest rally: ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ నేడు తలపెట్టిన నిరసన ర్యాలీకి, 2024 లోక్‌సభ ఎన్నికల వ్యూహాలకు ఎటువంటి సంబంధమూ లేదని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ అన్నారు. దేశంలో పెరిగిన నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం, జీఎస్టీ వంటి సమస్యలపై కాంగ్రెస్ ఈ నిరసన తెలుపుతోన్న విషయం తెలిసిందే. కేంద్ర సర్కారు తీరును ఎండగడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ఆ పార్టీ ముఖ్యనేతలు ఇందులో ప్రసంగించనున్నారు.

ఈ నేపథ్యంలో జైరాం రమేశ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… ద్రవ్యోల్బణం పెరగడం, నిరుద్యోగం వంటి సమస్యలతో దేశంలోని ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టడానికే ఈ నిరసన తెలుపుతున్నామని చెప్పారు. కరోనా సంక్షోభం తర్వాత ప్రజలు కొంత ఉపశమనం పొందే అవకాశాన్ని కూడా లేకుండా చేస్తున్నారని, ప్రధాని మోదీ పాలన వల్ల ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని అన్నారు. అందుకే తాము ఇవాళ రామ్ లీలా మైదానంలో నిరసన ర్యాలీ చేపట్టామని చెప్పారు. పెరిగిన ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా మన గళాన్ని విప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు రామ్ లీలా మైదానాకి వస్తున్నారని తెలిపారు.

Pakistan floods: వరదలతో అతలాకుతలం.. ప్రపంచ దేశాల సాయం కోరుతూ పాకిస్థాన్ అభ్యర్థన