పట్టాలు తప్పిన రైలు: పక్కకు జరిగిన నాలుగు బోగీలు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఓ రైలు పట్టాలు తప్పింది. రైల్వే స్టేషన్‌లోని మూడో నంబరు ఫ్లాట్ ఫారమ్ మీదకి వస్తుండగా రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. రైల్వే అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో కాసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయం సమయంలో ఈ ఘటన జరిగింది. సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ కూడా ఎటువంటి గాయాలు తగలలేదు.
Four coaches of a train derail at Platform number 3 of the Kanpur Central railway station. No injuries reported. pic.twitter.com/Px244btlsJ
— ANI UP (@ANINewsUP) August 28, 2019