షాకింగ్ న్యూస్.. రైలు టికెట్‌ ధరలు పెరిగిపోతున్నాయ్‌.. స్లీపర్, ఏసీ.. దేనిమీద ఎంత? ఎప్పటినుంచి? ఫుల్ డీటెయిల్స్‌..

సంస్థ ఉద్యోగుల జీతాలు, బోనస్‌లు, పింఛన్లు, ఇతర ఉద్యోగ సంబంధిత ఖర్చులు రూ.1,15,000 కోట్లకు పెరిగిందని రైల్వే చెప్పింది. పింఛను ఖర్చు రూ.60,000 కోట్లకు చేరిందని వివరించింది.

షాకింగ్ న్యూస్.. రైలు టికెట్‌ ధరలు పెరిగిపోతున్నాయ్‌.. స్లీపర్, ఏసీ.. దేనిమీద ఎంత? ఎప్పటినుంచి? ఫుల్ డీటెయిల్స్‌..

Updated On : December 21, 2025 / 3:25 PM IST

Train journeys: రైళ్లలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? లేదంటే తరుచూ మీ ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు వెళ్తారా? మీకో షాకింగ్ న్యూస్. రైలు టికెట్‌ ధరలు ఈ నెల 26 నుంచి పెరగనున్నాయి.

తక్కువ దూరం ప్రయాణించే వారిపై మాత్రం ఏ భారమూ పడదు. 215 కిలోమీటర్ల వరకు జనరల్ క్లాస్ టికెట్ల ధర మారదు కానీ, అంతకంటే ఎక్కువ దూరం ఉన్న టికెట్లు కిలోమీటర్‌కు ఒక పైసా చొప్పున పెరుగుతాయి. (Train journeys)

మైల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్ ఎయిర్ కండీషన్డ్ కోచుల్లో ప్రయాణానికి 2 పైసా/కిలోమీటర్ ధర పెరుగుతుంది. ఎయిర్ కండీషన్డ్ కోచుల్లో కూడా 2 పైసా/కిలోమీటర్ పెరుగుతుంది. అంటే, 500 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే నాన్ ఎయిర్ కండీషన్డ్ కోచుల్లో ఇప్పుడున్న దానికంటే రూ.10 ఎక్కువ ఖర్చు అవుతుంది.

Also Read: శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాను షేక్ చేసే 5 పవర్‌ఫుల్ కెమెరా ఫోన్లు.. DSLR రేంజ్ ఫొటోలు తీయొచ్చు..!

రైల్వే శాఖ దీనిపై స్పందిస్తూ… గత దశాబ్దంలో తమ ఆపరేషన్లు, నెట్‌వర్క్ విస్తరించాయని చెప్పింది. తాజా ధరల పెంపు రైల్వే వార్షిక ఆదాయాన్ని రూ.600 కోట్ల మేర పెంచుతుందని వివరించింది.

సంస్థ లేదా సంస్థ ఉద్యోగుల జీతాలు, బోనస్‌లు, పింఛన్లు, ఇతర ఉద్యోగ సంబంధిత ఖర్చులు రూ.1,15,000 కోట్లకు పెరిగిందని చెప్పింది. పింఛను ఖర్చు రూ.60,000 కోట్లకు చేరిందని వివరించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆపరేషన్ ఖర్చు రూ.2,63,000 కోట్లుగా ఉందని చెప్పింది.

ఈ ఖర్చు పెరుగుదలను తట్టుకునేందుకు రైల్వే స్మార్ట్ కార్గో లోడింగ్ పెంచడం, ప్రయాణికుల టికెట్ ధరలు పెంచడం మీద దృష్టి పెడుతుంది.

రైల్వే శాఖ ఆగస్టులోనూ టికెట్ ధరలను పెంచింది. అప్పట్లో మైల్స్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-ఎయిర్ కండీషన్డ్ క్లాసులో 1 పైసా/కిలోమీటర్ ధర పెరిగింది. ఎయిర్ కండీషన్డ్ క్లాసులో 2 పైసా/కిలోమీటర్ ధర పెరిగింది.

అంతకుముందు 2020 జనవరి 1న రైల్వే ధరలను పెంచింది. సెకండ్‌ క్లాస్ ధరలు సాధారణ, మైల్స్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 1 పైసా/కిలోమీటర్, 2 పైసా/కిలోమీటర్ పెరిగాయి. స్లీపర్ క్లాసుల్లో 2 పైసా/కిలోమీటర్, అన్ని ఎయిర్ కండీషన్డ్ క్లాసుల్లో 4 పైసా/కిలోమీటర్ పెరిగాయి.