Organic Soap యూనిట్ ఆరంభించిన Transgenders

Transgenders వినూత్నంగా ఆలోచించారు. కరోనా మహమ్మారి తర్వాత తమకు తాముగా నిలబడటానికి సొంత వ్యాపారం మొదలుపెట్టారు. సైదాపేటకు చెందిన శ్వేతా సుధాకర్ తన ఇద్దరి స్నేహితులతో కలిసి ఆరంభించారు. ఇది ఆమెకే కాకుండా వారి కమ్యూనిటీ మొత్తానికి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు.
శ్వేతా సుధాకర్ కొన్నేళ్లుగా వారి కమ్యూనిటీ బాగుపడటం కోసం కష్టపడుతున్నారు. ‘కేకే నగర్‌లో సనవి, షెర్లీనాలతో పాటు నేనూ క్రీపిస్ కాస్మొటిక్స్- కాస్మోటిక్స్ ఫార్ములేషన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సోప్ మేకింగ్ లో ట్రైనింగ్ అయ్యాం.
దాంతో పాటుగా ఆమె రూ.12వేలు పెట్టుబడి పెట్టి సోప్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ మొదలుపెట్టారు. ‘దీనికి ట్రాన్స్ నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ అని పేరు పెట్టారు. ఇది పూర్తిగా కలబందతో తయారీ అవుతుంది. శాన్వి, షెర్లినా ప్రొడక్షన్ పనులు చూసుకుంటే నేను మార్కెంటింగ్ హ్యాండిల్ చేస్తాను. అని ఆమె చెప్పారు.
ఈ యూనిట్ ను సెప్టెంబర్ 30న స్టార్ట్ చేయగా.. తొలి రోజునే రూ.3వేల 200అమ్మకం జరిపారు. ఈ సోప్ బార్ లైఫ్ సంవత్సరం వస్తుండగా చర్మానికి చాలా అనువుగా ఉంటుంది. ఎవరైనా మార్నింగ్ ఆర్డర్ పెడితే సాయంత్రం వరకూ డెలివరీ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
ఒక్కో సబ్బు ఖరీదు రూ.50. ‘ బిజినెస్ డెవలప్ అయ్యే కొలది మా కమ్యూనిటీలో మరికొంత మంది ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పిస్తాం. మా జీవనశైలిని ఇంప్రూవ్ చేస్తుందని నమ్ముతుననాం. ఇప్పటికే మా కమ్యూనిటీలో కొంతమందికి టైలరింగ్ లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం’ అని ఆమె అన్నారు.