భూ ప్రకంపనలతో ఉలిక్కిపడ్డ ఢిల్లీ, పంజాబ్‌లు

భూ ప్రకంపనలతో ఉలిక్కిపడ్డ ఢిల్లీ, పంజాబ్‌లు

Updated On : September 24, 2019 / 11:27 AM IST

ఢిల్లీతో పాటు దాని చుట్టూ ఉన్న పలు ప్రాంతాల్లో మంగళవారం భూ ప్రకంపనలు సంభవించాయి. పాకిస్తాన్-భారత సరిహద్దులో భూకంపం సంభవించినట్లు గుర్తించారు. రిక్టార్ స్కేల్‌పై 6.3గా భారత మెటరాలాజికల్ డిపార్ట్‌మెంట్ గుర్తించింది. 40కిలో మీటర్ల లోతు నుంచి ఈ ప్రకంపనలు మొదలైనట్లు రిపోర్ట్‌లో వెల్లడించింది. భారత్-పాక్ సరిహద్దు అంటే జమ్మూ కశ్మీర్‌లోనే ఎక్కువ ప్రాంతంలో ప్రభావం కనిపించింది. 

ఢిల్లీ, పంజాబ్‌తో పాటు ఉత్తర భారతంలోని మరికొన్ని ప్రాంతాల్లో ప్రమాద ఘంటికలు మోగాయి. పాకిస్తాన్‌లోని లాహోర్ వాయువ్య దిశ నుంచి ఈ ప్రకంపనలు మొదలయ్యాయి. భూకంప తీవ్రతను తెలియజేసే సెంటర్ ఈ ప్రకంపనలను రిక్డార్ స్కేల్‌పై 6.1గా గుర్తించారు. సోమవారం సాయంత్రం నాటికి అమెరికాలోని ఓ ప్రాంతంలో భూ ప్రకంపనలు గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలజికల్ సర్వే తెలిపింది.

ఈ ఘటన నమోదైన తర్వాత ఎటువంటి నష్టం జరగలేదని సమాచారం. శాన్ ఆంటోనియో వాయువ్య ప్రాంతంలో రాత్రి 11గంటల 23నిమిషాలకు 62కిలోమీటర్ల మేర 10కిలో మీటర్ల లోతు నుంచి ప్రకంపనలు నమోదయ్యాయి. అమెరికాలో ఉన్న ప్రధాన ఎయిర్‌పోర్టు రాఫెల్ హెర్నాండేజ్ శాన్ ఆంటోనియో ప్రాంతానికి చెందినదే.