ట్రెండ్లీ కంప్లైంట్ : నా హార్ట్ కనిపించడం లేదు

  • Published By: veegamteam ,Published On : January 9, 2019 / 03:57 AM IST
ట్రెండ్లీ కంప్లైంట్ : నా హార్ట్ కనిపించడం లేదు

నాగ్‌పూర్ : నా హృదయం (మనస్సు, హార్ట్) కనిపించటంలేదు..మీకేమైనా కనిపించిందా? కనిపిస్తే నాకిప్పించండి..అంటు ఓ యువకుడు నాగ్ పూర్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు బుర్ర గిర్రున తిరిగిపోయింది. యువకుడి కంప్లైంట్ ఏమిటో విన్న కాసేపటికి అసలు విషయం అర్థం అయ్యేసరికి పోలీసులు బిత్తరపోయాడు. కాసేపటికి తేరుకున్న వారు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా వినని యువకుడి గత కొంతకాలంగా నా  హృదయం కనిపించడం లేదు..దాన్ని ని ఓ అమ్మాయి దొంగిలించిందని..వెతికి పెట్టాల్సిందేనని పట్టుపట్టటంతో ఇటువంటి కంప్లైంట్స్ తీసుకోలేమని అతనికి కన్విన్స్ చేసి పంపించేసరికి పోలీసులకు తల ప్రాణం తోకకు వచ్చినంత పనైంది. 

ఓ కార్యక్రమంలో నాగ్‌పూర్ పోలీస్ కమిషనర్ భూషణ్ కుమార్ ఉపాధ్యాయ్ ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు.  ప్రతీరోజై తమకు పబ్లిక్ నుండి చాలా కంప్లైంటస్ వస్తుంటాయి కానీ ఇటువంటివి అప్పుడప్పుడు కూడా వస్తుంటాయని అన్నారు.