శారదా చిట్ ఫండ్ కుంభకోణంపై సుప్రీంకోర్టులో విచారణ

శారదా చిట్ ఫండ్ కుంభకోణంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోల్ కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ విచారణకు సహకరించడం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. రాజీవ్ ఇంటిపై సీబీఐ దాడి చేసిన రోజు ఏం జరిగిందో చెప్పాలన్నారు సొలిసిటర్ జనరల్. రాజీవ్ ఇంట్లో ఆధారాలు ఉన్నాయన్న అనుమానం ఉన్నప్పుడు ఎందుకు సెర్చ్ వారెంట్ తీసుకోలేదని సీజేఐ తుషార్ ను ప్రశ్నించింది. రాజీవ్ ను కస్టడీయల్ విచారణకు ఇచ్చేందుకు ఆధారాలు చూపాలని సుప్రీం తెలిపింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది.