TRS MLAs Trap Case : సుప్రీంకోర్టుకు ఎమ్మెల్యే కొనుగోలు నిందితులు .. తమ అరెస్టును సవాల్ చేస్తూ పిటీషన్ ..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కాస్తా సుప్రీంకోర్టుకు వెళ్లింది. తమను అరెస్ట్ చేయటాన్ని సవాల్ చేస్తూ నిందుతులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

TRS MLAs Trap Case Sc
TRS MLAs Trap Case : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కాస్తా సుప్రీంకోర్టుకు వెళ్లింది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనటానికి కుట్ర చేశారని..కోట్ల రూపాయలు నగదు ఆశ చూపించటానికి కుట్ర పన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందుతులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమను అరెస్ట్ చేయటాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ అరెస్ట్ చెల్లదని..ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు ఈకేసులో ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలు. ఈ పిటీషన్ ను శుక్రవారం లిస్ట్ చేయాలని సీజేఐ ఆదేశించారు.
కాగా మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నం జరిగిందనే వార్తలతో తీవ్ర సంచలనం రేపింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు భారీగా నగదు ఆశచూపారనే కారణంతో రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలను అరెస్ట్ చేశారు. వీరు ప్రస్తుతం జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో నిందితులైన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, నంద కుమార్, సింహయాజీలు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే యత్నం చేసిన కేసులో తమ అరెస్టును సవాలు చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
నిందితులను అరెస్టు చేయడానికి అనుమతినిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం ముందు నిందితుల తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. శుక్రవారం విచారణ కేసుల జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీకి సీజేఐ ధర్మాసనం ఆదేశించింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుయత్నం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు జైలుకు తరలించారు. అక్టోబర్ 26న ఈ కేసు వెలుగులోకి రాగా.. పెను సంచలనం కలిగించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఈ ముగ్గురిని పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 41-ఏ సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తగదంటూ రిమాండ్ ను మొదట ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోవాలని న్యామూర్తి ఆదేశాలు జారీ చేశారు. లేదా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇలా పలు మలుపులు తిరుగుతున్న ఈకేసు భారత సర్వోన్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టుకు చేరింది.