Vijay TVK Government : గవర్నర్ను కలిసిన విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరిన టీవీకే చీఫ్
Vijay TVK Government Formation: ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత.. సభలో తన ప్రభుత్వ మెజారిటీని విజయ్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇది రెండో దశ. టీవీకేకి కాంగ్రెస్ మద్దతు ఉన్నప్పటికీ ఇంకా సాయం అవసరం.
Tvk Chief Vijay Meets Tamil Nadu Governor Ask Permission To Form Government
Vijay TVK Government: టీవీకే అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్ విశ్వనాథ్ ఆర్లేకర్ ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ అనుమతి కోరారు. రేపు లేదా ఎల్లుండి విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నెహ్రూ స్టేడియంలో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణస్వీకారానికి రాహుల్ గాంధీ సహా ప్రముఖులు హాజరుకానున్నారు.
లోక్ భవన్ కు వెళ్లిన విజయ్ గవర్నర్ తో సమావేశమయ్యారు. తమిళనాడులో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది తమిళగ వెట్రి కజగం (టీవీకే). 108 స్థానాలను కైవసం చేసుకుంది. కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 118 సీట్ల మెజారిటీ మార్కు అవసరం.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత.. సభలో తన ప్రభుత్వ మెజారిటీని విజయ్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇది రెండో దశ. టీవీకేకి కాంగ్రెస్ మద్దతు ఉన్నప్పటికీ ఇంకా సాయం అవసరం. కాంగ్రెస్ కాకుండా స్వతంత్రులతో సహా విజయ్ బృందంలో చేరడానికి ఇంకా ఎవరెవరు వస్తారనే దానిపై స్పష్టత లేదు. రెండు సీట్లు గెలుచుకున్న వీసీకే.. టీవీకేకు మద్దతుపై అంతర్గత చర్చలు జరుపుతోంది. డీఎంకే 59 సీట్లు, ఏఐఏడీఎంకే 47, పీఎంకే 4, ఐయూఎంఎల్ 2, సీపీఐ 2, సీపీఐ(ఎం) 2, బీజేపీ, డీఎండీకే, ఏఎంఎంకే ఒక్కో సీటును గెలుచుకున్నాయి.
Also Read: విజయ్ కి మద్దతుగా 30 మంది ఎమ్మెల్యేలు.. TVKలో ఆ పార్టీ విలీనం..?
