Fire Mishap : బెంగళూరులో ఘోర ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దేవీచిక్కనహల్లిలోని ఓ అపార్ట్‌మెంట్ లో మంగళవారం సాయంత్రం సిలిండర్ పేలింది

Fire Mishap
Fire Mishap : కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దేవీచిక్కనహల్లిలోని ఓ అపార్ట్‌మెంట్ లో మంగళవారం సాయంత్రం సిలిండర్ పేలింది.. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఓ మహిళతోపాటు మరొకరు సజీవదహనమయ్యారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో అపార్ట్‌మెంట్ మొత్తం పొగాకమ్మేసింది.
Read More : Vishaka Blast: విశాఖ అచ్యుతాపురం సెజ్‌లో పేలుడు.. ఆరుగురికి గాయాలు
దీంతో ఊపిరాడక చాలామంది పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అపార్ట్‌మెంట్‌లో చిక్కుకుపోయిన చాలా మందిని సిబ్బంది రక్షించారు. అపార్ట్‌మెంట్ అంతా పొగ వ్యాపించడంతో అందులో ఉన్న జనం శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.