Karnataka: బస్సు యాత్ర కోసం రెండు గ్రూపులుగా ఏర్పడ్డ కాంగ్రెస్
రాష్ట్రంలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని, ఎన్నికలు సమీపించేలోపు ఈ యాత్ర పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యాత్ర చేపట్టినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ బీజేపీ అనేక అవినితీ ఆరోపణల్లో ఇరుక్కోవడం, అలాగే పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది

Two groups will be formed for the Congress Bus Yatra in Karnataka
Karnataka: రాబోయే అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా కర్ణాటక కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్ర రెండుగా విడిపోయింది. ఈ బస్సు యాత్ర ప్రకటన చేసినప్పటి నుంచి కాంగ్రెస్ నేతల్లో రథసారధి ఎవరనే దానిపై ఆందోళన నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధినేతగా డీకే శివకుమార్ ఆ బాధ్యతలు తీసుకుంటారా? లేదంటే రాష్ట్ర విపక్ష నేత అయిన సిద్ధరామయ్య నడిపిస్తారా అనే గందరగోళం నడిచింది. దీనికి తాజాగా సిద్ధరామయ్య స్పష్టతనిచ్చారు. బస్సు యాత్ర రెండు గ్రూపులుగా సాగుతుందని, ఒక గ్రూపుకు తాను సారధ్యం వహిస్తే, మరొక గ్రూపుకు డీకే శివకుమార్ సారధ్యం వహిస్తారని సిద్ధరామయ్య చెప్పారు.
#GetOutRavi: గవర్నర్కు వ్యతిరేకంగా తమిళనాడు గోడలపై పోస్టర్లు.. నెట్టింట్లో ట్వీట్ల వర్షం
రాష్ట్రంలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని, ఎన్నికలు సమీపించేలోపు ఈ యాత్ర పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యాత్ర చేపట్టినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ బీజేపీ అనేక అవినితీ ఆరోపణల్లో ఇరుక్కోవడం, అలాగే పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వ తప్పిదాన్ని ప్రజల ముందు ఎండగట్టి తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందాలని కాంగ్రెస్ భావిస్తోందని విమర్శకులు అంటున్నారు.