శుక్ర, శనివారాల్లో రెండు మిలిటరీ ప్రత్యేక రైళ్లు

సైనికులను సరిహద్దులకు చేరవేసేందుకు రైళ్లను నడుపనున్నారు. శుక్ర, శనివారాల్లో రెండు రైళ్లు నడవనున్నాయి. 

  • Published By: veegamteam ,Published On : April 16, 2020 / 01:07 PM IST
శుక్ర, శనివారాల్లో రెండు మిలిటరీ ప్రత్యేక రైళ్లు

Updated On : April 16, 2020 / 1:07 PM IST

సైనికులను సరిహద్దులకు చేరవేసేందుకు రైళ్లను నడుపనున్నారు. శుక్ర, శనివారాల్లో రెండు రైళ్లు నడవనున్నాయి. 

కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ విధించడంతో అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రంగాలు మూతపడ్డాయి. రవాణ వ్యవస్థ నిలిచిపోయింది. ఎయిర్ లైన్స్, నేవీ, రైళ్లు, బస్సులు బంద్ అయ్యాయి.  దేశమంతటా రైళ్లు నిలిచిపోయింది. కానీ సైనికులను సరిహద్దులకు చేరవేసేందుకు రైళ్లను నడుపనున్నారు. శుక్ర, శనివారాల్లో రెండు రైళ్లు నడవనున్నాయి. 

ఉత్తర, తూర్పు సరిహద్దుల రక్షణ అవసరాల కోసం బయలుదేరనున్న ఈ మిలిటరీ స్పెషల్ రైళ్లకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చిందని సీనియర్ అధికారి వెల్లడించారు. ఏప్రిల్ 17న బయలుదేరే మొదటి రైలు బెంగళూరు-బెల్గాం-సికింద్రాబాద్-అంబాలా-జమ్ము మార్గంలో, రెండో రైలు.. బెంగళూరు-బెల్గాం-సికింద్రాబాద్-గోపాల్ పూర్- హౌరా-న్యూజల్పాయ్ గుడి-గువాహటి మార్గంలో ప్రయాణిస్తాయి. 

బెంగళూరు, బెల్గాం, సికింద్రాబాద్, గోపాల్ పూర్లలోని సైనిక శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న సైనికులను ఈ రైళ్ల ద్వారా వారి నిర్ధేశిత గమ్యాలకు చేరుస్తారు. దీంతో సరిహద్దు భద్రత బలోపేతం కావడంతోపాటు ఆయా శిక్షణ కేంద్రాల్లో రద్దీ కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లను నడుపనున్నట్లు తెలుస్తోంది. 

Also Read | భారత గబ్బిల్లాల్లో కరోనా వైరస్…ICMR పరిశోధనల్లో వెలుగులోకి కీలక విషయాలు