కశ్మీర్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు పాక్ ఉగ్రవాదులు హతం

  • Published By: venkaiahnaidu ,Published On : December 13, 2020 / 09:21 PM IST
కశ్మీర్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు పాక్ ఉగ్రవాదులు హతం

Updated On : December 13, 2020 / 9:26 PM IST

Two Pakistani terrorists killed జమ్ముకశ్మీర్‌లోని ఫూంచ్‌ జిల్లాలో ఆదివారం(డిసెంబర్-13,2020)భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పాకిస్థాన్​కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరొక ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. పూంచ్ జిల్లాలోని దుర్గన్ పొషానా ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అధికారులు తెలిపిన ప్రకారం..ఈ ఉగ్రవాదులు మూడురోజుల క్రితం నియంత్రణ రేఖ దాటి పాకిస్తాన్ నుంచి భారత్‌ లోకి ప్రవేశించారు. ఆదివారం దక్షిణ కశ్మీర్ షోపియన్ జిల్లాకు వెళ్తుండగా మధ్యాహ్నం మొఘల్ రోడ్లులో వీరిని భద్రతా దళాలు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. లొంగిపోవాలని కోరినా వారు తిరస్కరించి కాల్పులు జరపడంతో భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు హతమయ్యారని తెలిపారు.

కాగా,ప్రస్తుతం దశలవారీగా జమ్మూకశ్మీర్ లో జరగుతున్న డిస్ట్రిక్ డెవలప్మెంట్ కౌన్సిల్(DDC)ఎన్నిలకు అద్భుత స్పందన వస్తుండటంతో భరించలేని పాకిస్థాన్‌ లష్కర్‌‌-ఈ-తోయిబా, జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థల సహకారంతో ఉగ్రమూకలను భారత్‌వైపు ఉసిగొలుపుతోందని అధికారులు తెలిపారు. హతమైన ఉగ్రవాదులను పాకిస్తాన్ పౌరులుగా అనుమానిస్తున్నామని, వారి వివరాలు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.