Student Washing Toilets : ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ శుభ్రం చేసిన విద్యార్థిని

కాంచీపురం జిల్లాలోని అలపాక్కమ్‌ ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థిని టాయిలెట్‌ ను కడుగుతుండగా గుర్తుతెలియని వ్యక్తి వీడియో తీశాడు.

Student Washing Toilets : ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ శుభ్రం చేసిన విద్యార్థిని

Student

Updated On : March 30, 2022 / 10:07 AM IST

student washing toilets : తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు టాయిలెట్‌ కడుగుతున్న రెండు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. కాంచీపురం, ఈరోడ్‌ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాంచీపురం జిల్లాలోని అలపాక్కమ్‌ ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థిని టాయిలెట్‌ ను కడుగుతుండగా గుర్తుతెలియని వ్యక్తి వీడియో తీశాడు. మరో వీడియోలో ఈరోడ్‌ జిల్లాలోని పురుందురై ప్రభుత్వ స్కూల్ లో పలువురు విద్యార్థులు టాయిలెట్‌ కడుగుతూ కనిపించారు.

Madhya Pradesh : విద్యార్థిని ఫిర్యాదు.. టాయిలెట్లు కడిగిన మంత్రి

దీంతో అధికారులు విచారణకు ఆదేశించారు. అయితే మొదటి వీడియోను గత ఆదివారం రికార్డు చేశారని విచారణలో తేలింది. దీంతో ఆ విద్యార్థిని ఆదివారం రోజు స్కూల్‌కు ఎందుకు వెళ్లింది? వీడియోను ఎవరు తీశారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

అలాగే ఈరోడ్‌ స్కూల్‌ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ రెండు ఘటనల్లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు డీఈవోలను ఆదేశించారు.