మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే

  • Published By: sreehari ,Published On : November 22, 2019 / 01:44 PM IST
మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే

Updated On : November 22, 2019 / 1:44 PM IST

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ వీడింది. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనతో పొత్తుకు కాంగ్రెస్ ఎట్టకేలకు మద్దతును ప్రకటించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేగా ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిపాదించాయి. శనివారం (నవంబర్ 23, 2019) అధికారిక ప్రకటన రానుంది. కాంగ్రెస్, ఎన్సీపీకి డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నాయి. రేపు మూడు పార్టీల మీడియా సమావేశం జరుగనుంది.

ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనతో కలిసి భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో మూడు పార్టీలు కలిసి తుదినిర్ణయాన్ని వెల్లడించాయి. మహారాష్ట్ర సీఎంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేను సంకీర్ణ ప్రభుత్వంలో సీఎం చేయాలని ప్రతిపాదించాయి. శివసేనకు, కాంగ్రెస్ లకు టాప్ పోస్టులు తీసుకోవాలని ఎన్సీపీ ప్రతిపాదించింది. ఈ భేటీ అనంతరం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మీడియాతో మాట్లాడుతూ..మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. 

మా ఎజెండాపై మరింత చర్చ జరుపుతామన్నారు. సీఎంగా శివసేన నుంచి ఉద్ధవ్ థాక్రే పేరును ఆయన ప్రతిపాదించారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. గవర్నర్ ను కలిసే అంశంపై శనివారం (నవంబర్ 23, 2019)  మూడు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకోనున్నాయి.