Classes Open: యూనివర్సిటీలు, కళాశాలల్లో తరగతులు ప్రారంభించండి: యూజీసీ ఆదేశాలు

దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కళాశాలలు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్ యూజీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.

Classes Open: యూనివర్సిటీలు, కళాశాలల్లో తరగతులు ప్రారంభించండి: యూజీసీ ఆదేశాలు

Ugc

Updated On : February 12, 2022 / 4:30 PM IST

Classes Open: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నవేళ..కేంద్ర వైద్యారోగ్య సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ సంస్థలు కరోనా ఆంక్షలు సడలిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ, ఢిల్లీ, సిక్కిం, మహారాష్ట్రలో కరోనా ఆంక్షలు ఎత్తివేయగా..ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. ఈక్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కళాశాలలు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్ యూజీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని యూనివర్సిటీలకు శుక్రవారం ఒక నోటీసు జారీచేసింది యూజీసీ.

Also read: Indian NCAP: ఇకపై భారత్ లో వాహనాలకు “స్వదేశీ భద్రతా ప్రమాణాలు”

దేశ వ్యాప్తంగా ఉన్న యూజీసీ అనుబంధ యూనివర్సిటీలు, కళాశాలలో ప్రత్యక్ష తరగతులతో పాటు, స్థానిక పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని..ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులందరూ తరగతులకు హాజరయ్యేల చూడాలని, ప్రత్యక్ష తరగతులకు హాజరు కాలేని విద్యార్థుల కొరకు ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని యూజీసీ సూచించింది. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులకనుగుణంగా..పరీక్షలు సైతం ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో నిర్వహించాలని సూచించింది. ఈమేరకు పలు మార్గదర్శకాలు విడుదల చేసింది.

Also read: Hijab Row: మా అంతర్గత వ్యవహారంలో మీరు తలదూర్చకండి: హిజాబ్ పై విదేశాంగశాఖ వివరణ

COVID-19 మహమ్మారి, లాక్‌డౌన్‌ అనంతర పరిస్థితుల దృష్ట్యా అకడమిక్ క్యాలెండర్ లో మార్పులు, పరీక్షలు, విద్యాసంస్థల పునఃప్రారంభం, వంటి విషయాలపై ప్రామాణిక విధానాలకు సంబంధించి కమిషన్ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని యూనివర్శిటీలు, కళాశాలలు మరియు ఇతర ఉన్నత విద్యా సంస్థలలో కోవిడ్ నియమాలు ఖచ్చితంగా పాటించేలా చూడలని జాతీయ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ యూజీసీకి సూచించింది.

Also read: Cellphone Driving: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ఇకపై చట్టబద్ధం: నితిన్ గడ్కరీ