ప్రధాన్ మంత్రి ఉజ్జ్వల యోజన: సెప్టెంబర్ వరకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు

  • Published By: vamsi ,Published On : July 10, 2020 / 06:40 AM IST
ప్రధాన్ మంత్రి ఉజ్జ్వల యోజన: సెప్టెంబర్ వరకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు

Updated On : July 10, 2020 / 10:34 AM IST

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కరోనావైరస్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి కరోనా కాలంలో పేద కుటుంబాలు, రైతులు మరియు వలస కార్మికులతో సహా ఇతర వర్గాల కోసం నిరంతరం చర్యలు తీసుకుంటుంది. కొద్ది రోజుల క్రితం పిఎం మోడీ గరీబ్ కల్యాణ్ ఆయోజనను నవంబర్ నాటికి పొడిగించాలని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు వేసింది. దేశంలోని కోట్ల కుటుంబాలకు పెద్ద ఉపశమనం ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్, జిఐసి మరియు ఉజ్జ్వాల పథకంలో పెద్ద మార్పులు చేసింది. వచ్చే మూడు నెలల పాటు ఏడు కోట్లకు పైగా ఉజ్జ్వాల పథకం లబ్ధిదారులకు ఉచిత సిలిండర్లు ఇవ్వాలని బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. ఉజ్జ్వాలా పథకం కింద సిలిండర్లు పొందిన వారు సెప్టెంబర్ వరకు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లను పొందుతారు.

సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. “ఉజ్జ్వాలా పథకం కింద గ్యాస్ సిలిండర్లు తీసుకునే 7.4 కోట్ల మహిళలకు మూడు సిలిండర్లు చితంగా ఇస్తున్నట్లు ప్రకటించారు” కరోనా కాలంలో పేదలకు ఆర్థిక భద్రత కల్పించడానికి, కేంద్ర ప్రభుత్వం PMGKY సహాయ ప్యాకేజీగా ప్రారంభించింది. ఈ ప్యాకేజీ కింద, ఉజ్జ్వాలా లబ్ధిదారులకు ఏప్రిల్ 1 నుంచి మూడు నెలల కాలంలో మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తారు.

Read Here>>యెస్‌ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ రూ.2800 కోట్ల ఆస్తులు జప్తు