Raghuram Rajan: అందుకే దేశంలో నిరుద్యోగం: రాహుల్‌తో రఘురామ్ రాజన్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో నిన్న పాల్గొన్న భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆ తర్వాత పలు అంశాలపై మాట్లాడారు. సామాజిక భద్రత ఉంటుందన్న ఉద్దేశంతో ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారని, ఇదే నిరుద్యోగానికి అతి పెద్ద కారణమని చెప్పారు. ఏళ్లకు ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుకుంటున్నారని, కొందరికే ఉద్యోగం వస్తుందని తెలిపారు. అందుకే ప్రైవేటు సెక్టార్ ను మరింత అభివృద్ధి చేసుకోవాలని అన్నారు.

Raghuram Rajan
Raghuram Rajan: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో నిన్న పాల్గొన్న భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆ తర్వాత పలు అంశాలపై మాట్లాడారు. రాహుల్ కు ప్రధానంగా దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, రైతుల సమస్యల గురించి వివరించారు. సామాజిక భద్రత ఉంటుందన్న ఉద్దేశంతో ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారని, ఇదే నిరుద్యోగానికి అతి పెద్ద కారణమని చెప్పారు. ఏళ్లకు ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుకుంటున్నారని, కొందరికే ఉద్యోగం వస్తుందని తెలిపారు. అందుకే ప్రైవేటు సెక్టార్ ను మరింత అభివృద్ధి చేసుకోవాలని అన్నారు.
దేశంలోని నలుగురు-ఐదుగురు బడా వ్యాపారవేత్తలు రోజురోజుకీ మరింత ధనవంతులుగా మారుతుంటే, మిగతా పౌరులు అందరూ మాత్రం వెనకబడిపోతున్న విషయంపై అడిగిన ప్రశ్నకు రాజన్ స్పందిస్తూ.. దేశంలో ఇది అతిపెద్ద సమస్యని చెప్పారు. కేవలం నలుగురు-ఐదుగురు బడా వ్యాపారవేత్తల విషయంలోనే కాకుండా ఉన్నత మధ్యతరగతి వారి ఆదాయం కూడా పెరిగిందని చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో వారు కార్యాలకు వెళ్లే అవసరం రాలేదని తెలిపారు.
పేద ప్రజలు మాత్రం పనికోసం ఫ్యాక్టరీలకు వెళ్లాల్సి వస్తుందని, అయితే, మహ్మమారి విజృంభణ సమయంలో కర్మాగారాలు మూసి వేయడంతో వారికి కూలీ దొరకలేదని చెప్పారు. నిరుపేద ప్రజలు ప్రభుత్వం నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందే అవకాశం వచ్చిందని, ఉన్నత వర్గాలకు చెందిన వారిపై మహమ్మారి ప్రభావం పడలేదని తెలిపారు. అయితే, దిగువ-మధ్య తరగతి ప్రజలే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని అన్నారు.
వారు ఉద్యోగాలు కోల్పోయారని, నిరుద్యోగం పెరిగిపోయిందని, వారి అప్పులు అధికమయ్యాయని చెప్పారు. దిగువ-మధ్యతరగతి ప్రజల కోసం పాలసీలు రూపొందించాలని అన్నారు. కాగా, రైతుల గురించి రాజన్ మాట్లాడుతూ.. దేశంలో స్థిరమైన దిగుమతి, ఎగుమతి పాలసీలు ఉండాలని చెప్పారు. పంట ఉత్పత్తుల ఎగుమతులను అధికంగా చేయకూడదని అన్నారు.
Kane Williamson: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అనూహ్య నిర్ణయం.. రంగంలోకి టిమ్ సౌథీ