SC, ST రిజర్వేషన్ల పొడిగింపు..కేబినెట్ గ్రీన్ సిగ్నల్

లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పొడగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2020 జనవరి 25తో గడువు ముగుస్తోంది. దీనిని మరో 10 ఏళ్ల పాటు పొడిగించాలని మంత్రివర్గం 2019, డిసెంబర్ 04వ తేదీ బుధవారం నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల పొడిగింపుపై పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయంతో 2030 జనవరి 25 వరకు రిజర్వేషన్లు వర్తించనున్నారు.
> ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది.
> వెనుకబడిన తరగతుల వారికి 1902 నుంచి రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు.
> రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పినా..కొన్ని రాష్ట్రాలు స్థానిక జనాభాను దృష్టిలో పెట్టుకుని అంతకుమించి రిజర్వేషన్లు ఇస్తున్నాయి.
> ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలకు, ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు, వివిధ చట్టసభల్లో సీట్లకు రిజర్వేషన్లు కల్పించారు.