Covid Effect On Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రపై కోవిడ్ ఎఫెక్ట్ .. మార్గదర్శకాలు పాటించాలని లేదంటే యాత్ర నిలిపివేయాలంటున్న కేంద్రం
భారత్ జోడో యాత్రపై కోవిడ్ ప్రభావం పడింది.మరోసారి కోవిడ్ ఆందోళనకర పరిస్థితులు భారత్ లో కూడా నెలకొన్న పరిస్థితుల రీత్యా రాహుల్ గాంధీ,అశోక్ గెహ్లాట్ కు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా లేఖ రాశారు. కోవిడ్ మార్గదర్శకాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని..నిబంధనలను పాటించడం సాధ్యం కాకపోతే, 'పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ' పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యాత్రను నిలిపివేయాలని కోరారు కేంద్ర ఆరోగ్యమంత్రి మాండవీయ.

Covid effect on Bharat Jodo Yatra
Covid effect on Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రపై కోవిడ్ ప్రభావం పడింది.మరోసారి కోవిడ్ ఆందోళనకర పరిస్థితులు భారత్ లో కూడా నెలకొన్న పరిస్థితుల రీత్యా రాహుల్ గాంధీ,అశోక్ గెహ్లాట్ కు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో ప్రజలు,ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. దీంతో భారత్ జోడో యాత్రలో సరైన కోవిడ్ మార్గదర్శకాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో మంత్రి మాండవీయ సూచించారు. కోవిడ్ నిబంధనలను పాటించడం సాధ్యం కాకపోతే, ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ’ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యాత్రను నిలిపివేయాలని కోరారు కేంద్ర ఆరోగ్యమంత్రి మాండవీయ.
యాత్రలో మాస్క్‌లు ధరించి,శానిటైజర్లను తప్పనికసరిగా వినియోగించాలని స్పష్టంచేశారు. అంతేకాదు జోడో యాత్రలో కోవిడ్ టీకాలు వేయించుకున్న వ్యక్తులు మాత్రమే పాల్గొనాలని లేఖలో స్పష్టంచేశారు. చైనాలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో ప్రస్తుతం ఉన్న ఆందోళనకర పరిస్థితులను ఏమాత్రం విస్మరించటానికి వీల్లేదని యాత్ర కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు అంటూ లేఖలో పేర్కొన్నారు.
జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, యుఎస్‌లలో కోవిడ్ కేసులలో పెరుగుతున్న క్రమంలో ఈ ప్రభావం భారత్ పై కూడా పడే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసులు నమోదైన వారి శాంపిల్స్ సేకరించి, జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు,కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్ ను కట్టడి చేయటానికి టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్, కోవిడ్ ప్రవర్తన నియమావళి కట్టుబడి ఉండటం వంటి ఐదు ప్లాన్స్ పై కేంద్రం దృష్టి పెట్టింది.
కాగా ఇప్పటికే చైనాలో కోవిడ్ కరాళ నృత్యం చేస్తోంది. చైనా జీరో కోవిడ్ విధానం ఆదేశం కొంప ముంచటమేకాకుండా మరోసారి ప్రపంచ దేశాలకు ఆందోళన పడేసింది. చైనాలో కోవిడ్ కేసులు లెక్కేలేకుండాపోతున్నాయి. అంతకంతకు తీవ్రస్థాయికి చేరుకుంటున్నారు. ఈ ప్రభావం ప్రపంచ దేశాలపై కూడా పడుతోంది. కొరియా,జపాన్, అమెరికాల్లో కూడా కొత్తగా కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీనికి భారత్ కూడా అతీతంకాదులా ఉంది పరిస్థితి. భారత్ లో కూడా కోవిడ్ కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం భారత్ లో 1000కిపైగా కేసులు నమోదు అయ్యాయి.
ఇటువంటి పరిస్థితుల్లో భారత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసులు నమోదైన వారి శాంపిల్స్ సేకరించి, జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని కేంద్రం ఆదేశించింది. కొంతకాలంగా చైనాలో కోవిడ్ కేసులు మళ్లీ భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్ర గురించి కేంద్ర ఆరోగ్య శాఖ పలుమార్గదర్శకాలను వెల్లడించింది. దీనికి సంబంధించి రాహల్ గాంధీకి లేఖ రాసింది.