Arunachal Pradesh : కబ్జా చేసే రోజులు పోయాయ్, భారత్‌ బార్డర్‌పై కన్నేస్తే ఖబడ్దార్‌ : అమిత్ షా వార్నింగ్

మన వీర జవాన్లు, ఐటీబీపీ సిబ్బంది ప్రదర్శించే దైర్యసాహసాల వల్ల భారత భూభాగంలో అంగుళం నేల అయినా అన్యాక్రాంత కానివ్వరని..సూది కొన మోపినంత భూభాగాన్ని కూడా ఆక్రమణకు గురికానివ్వని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.

Arunachal Pradesh :  కబ్జా చేసే రోజులు పోయాయ్, భారత్‌ బార్డర్‌పై కన్నేస్తే ఖబడ్దార్‌ : అమిత్ షా వార్నింగ్

Amit Shah Warn to China

Updated On : April 11, 2023 / 12:30 PM IST

Arunachal Pradesh : ఏ దేశం కూడా భారత్ భూభాగాన్ని కబ్జా చేసే రోజులు పోయాయ్..భారత్‌ బార్డర్ పై కన్నేస్తే ఖబడ్దార్ అంటూ భారత్ హోంమంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. ఏ దేశమైన భారత సరిహద్దులపైపు కన్నెత్తి చూస్తే ఊరుకోబోము అంటూ షా హెచ్చరించారు. అరుణాచల్‌ సరిహద్దు గ్రామమైన కిబితూలో సోమవారం (ఏప్రిల్ 10,2023) ‘వైబ్రెంట్‌ విలేజ్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా షా ఈ హెచ్చరికలు చేశారు.

దేశభక్తిని పుణికిపుచ్చుకున్న మన వీర జవాన్లు, ఐటీబీపీ సిబ్బంది భారత భూభాగంలో అంగుళం నేల అయినా అన్యాక్రాంత కానివ్వరని..అంగుళం భూమే కాదు సూది కొన మోపినంత భూభాగాన్ని కూడా ఆక్రమణకు గురికానివ్వని ఉద్ఘాటించారు. సరిహద్దుల్లో వీర జవాన్లు, ఐటీబీపీ సిబ్బంది పహారాల్లో భారతదేశం హాయిగా ఉంటోందని..మన ఆర్మీ ధైర్యసాహసాలు త్యాగాలతో దేశం అంతా ప్రశాంతంగా ఉందని అన్నారు.

అరుణాచల్‌ ప్రదేశంలో నమస్తే అని కాకుండా జైహింద్‌ అంటూ ఒకరినొకరు పలకరించుకుంటారనీ తెలిపారు. చైనీయులు భారత్ వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడాల్సిందేనన్నారు. మన ఆర్మీ ధైర్యసాహసాలతో చైనా ఆటలు ఇక్కడ సాగవని డ్రాగన్ ఇక్కడి నుంచి తోక ముడవాల్సివచ్చిందన్నారు. అమిత్‌ షా అరుణాచల్‌ప్రదేశ్‌ను సందర్శించడం ద్వారా తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని చైనా చేసిన విమర్శలను భారత ప్రభుత్వం తీవ్రంగా తిప్పికొట్టింది.

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్, యూనియన్ సహా నాలుగు సరిహద్దు రాష్ట్రాల్లోని 19 జిల్లాల్లోని 2,967 గ్రామాల్లో అమలు చేయను్న రూ.4,800 కోట్ల వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ (VVP)ని మంత్రి షా ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తు షా చైనాకు హెచ్చరికలు చేశారు. చైనా, మయన్మార్‌లతో సరిహద్దులు పంచుకునే అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లాలోని కిబితూలో ఈ కార్యక్రమం జరిగింది.