రైల్వే ఉద్యోగులకు బంపరాఫర్…78 రోజుల జీతం బోనస్

  • Published By: venkaiahnaidu ,Published On : September 18, 2019 / 09:55 AM IST
రైల్వే ఉద్యోగులకు బంపరాఫర్…78 రోజుల జీతం బోనస్

Updated On : September 18, 2019 / 9:55 AM IST

భారతీయ రైల్వే ఉద్యోగులకు కేంద్రం భారీ నజరానా ప్రకటించింది. బుధవారం(సెప్టెంబర్-18,2019) సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ మీటింగ్ తర్వాత కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాతో మాట్లాడారు. రైల్వే ఉద్యోగులకు 78రోజుల వేతనాన్ని బోనస్ గా ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.

11 లక్షల రైల్వే ఉద్యోగులకు ప్రభుత్వం గత 6 సంవత్సరాలుగా రికార్డ్ బోనస్ ఇస్తోందని, ఈ ఏడాది కూడా అదే విధంగా రికార్డ్ స్థాయిలో బోనస్ ఇస్తుందని జవదేకర్ తెలిపారు. ఈ సంవత్సరం 11లక్షల52వేల మంది రైల్వే ఉద్యోగులకు బోనస్‌గా 78 రోజుల వేతనం లభిస్తుందని ఆయన తెలిపారు. ఉత్పాదకతకు ఇది ప్రతిఫలం అని ఆయన తెలిపారు. బోనస్ ల రూపంలో ప్రభుత్వం 2వేల 24కోట్లను ఖర్చు చేస్తుందని తెలిపారు.