ముంబై బ్లాకౌట్‌పై స్పందించిన కేంద్రం : చైనా సైబర్ దాడులు చేసినట్లు ఆధారాలు లేవన్న కేంద్ర మంత్రి ఆర్కే సింగ్

ముంబై బ్లాకౌట్‌పై స్పందించిన కేంద్రం : చైనా సైబర్ దాడులు చేసినట్లు ఆధారాలు లేవన్న కేంద్ర మంత్రి ఆర్కే సింగ్

Updated On : March 2, 2021 / 9:27 PM IST

RK Singh reacts to the Mumbai blackout : ముంబైలో గతేడాది అక్టోబర్ 12న అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వెనుక చైనా కుట్ర దాగుందన్న కథనం హాట్ టాపిక్‌గా మారింది. అటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెరలేపుతూనే… ఇటు భారత పవర్ గ్రిడ్ వ్యవస్థపై చైనా సైబర్ దాడికి పాల్పడిందని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. భారత్‌లోని పవర్ గ్రిడ్ వ్యవస్థను టార్గెట్ చేసేందుకు రెడ్ ఎకాన్ అనే చైనా సంస్థ ప్రత్యేక మాల్‌వేర్ ఉపయోగించినట్లు తెలిపింది.

ముంబై బ్లాక్ ఔట్ పై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ స్పందించారు. దేశంలోని పవర్ గ్రిడ్ వ్యవస్థపై సైబర్ దాడి వెనుక చైనా హస్తం ఉందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అయితే సైబర్ హ్యాకింగ్ ప్రయత్నాలు మాత్రం జరిగాయని చెప్పారు. పవర్ లోడ్ డిస్పాచ్ సెంటర్లపై సైబర్ దాడులకు ప్రయత్నాలు జరిగాయని ఆర్కే సింగ్ చెప్పారు. హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగినా… పవర్ సిస్టమ్ ఆపరేషన్‌పై అది ప్రభావం చూపలేదన్నారు.