పెళ్లి చేసుకోవటానికి మతం మార్చుకోవాలనటం కరెక్ట్ కాదు : హైకోర్టు

UP: Allahabad HC: నేటి యువత ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రేమకు కులం..మతం తేడాలు లేవు. కానీ పెళ్లి చేసుకోవటానికి మాత్రం మతం అవసరమా? ప్రేమించుకున్నప్పుడు అవేవీగుర్తుకు రానిది పెళ్లికి మాత్రం మతం మార్చుకోవాలా? అది అంత అవసరమా? అనే విషయంపై అలహాబాద్ హైకోర్టు స్పందించి కీలక వ్యాఖ్యలు చేసింది.
మతాంతర వివాహం ఓ జంట చేసుకున్న వేసిన జంట తమకు కుటుంబ సభ్యుల నుంచి హాని ఉందని, రక్షణ కల్పించాలంటూ ఓ జంట దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై స్పందించింది. ఈ పిటీషన్ ను త్రోసిపుచ్చిన అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి కోసమే మతం మార్చుకోవడం ఆమోదనీయం కాదని స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళితే..ఓ ముస్లిం యువతి హిందూ యువకుడ్ని ప్రేమించింది. వారు పెళ్లి చేసుకోవటానికి నెల రోజుల ముందే ఆ ముస్లిం యువతి హిందూ మతం స్వీకరించింది. ఈ క్రమంలో సదరు యువతి బంధువులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముస్లిం కుటుంబంలో పుట్టి హిందూ యువకుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకోవటమే కాకుండా హిందూ మతం తీసుకోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయంతో..మతాంతర వివాహం చేసుకున్న ఆ కొత్త జంట హైకోర్టును ఆశ్రయించారు. తమ కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని దయచేసి మాకు రక్షణ కల్పించాలంటూ కోరింది.
https://10tv.in/cross-border-wedding-couple-ties-the-knot-on-a-pier-with-the-family-blessing-them-from-a-boat/
ఈ విషయంపై ధర్మాసనం ‘‘పెళ్లి చేసుకునేందుకే మతం మారినట్టు స్పష్టంగా అర్థమవుతోందనీ..పెళ్లి చేసుకోవటానికి మతం మతం మార్చుకోవాలనటం సరికాదని‘’’ జస్టిస్ మహేశ్‌చంద్ర త్రిపాఠీ 2014లో ఇదే కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అప్పట్లో ఓ యువతి ఇస్లాంలోకి మారి ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. న్యాయమూర్తి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. పెళ్లి చేసుకోవడం కోసమే మతం మారడం సరైంది కాదని పేర్కొన్నారు. ఆయా మత విశ్వాసాలు, సంప్రదాయల గురించి ఎటువంటి అవగాహన లేకుండా కేవలం పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే మతాలను స్వీకరించడం ఆమోదనీయం కాదని స్పష్టం చేశారు.