UP Assembly Election: యూపీ కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా ఇదే..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఆ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కూడా జోరు అందుకుంది.

UP Assembly Election: యూపీ కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా ఇదే..

Sonia Gandhi

Updated On : January 24, 2022 / 8:59 PM IST

UP Assembly Election: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఆ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కూడా జోరు అందుకుంది. ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని పోటాపోటీగా కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సంబంధించి యూపీ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను రిలీజ్ చేసింది.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను తలకెత్తుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన ప్రచారకర్తల (స్టార్ క్యాంపెయినర్లు) జాబితాను కాంగ్రెస్ సోమవారం (జనవరి 24) విడుదల చేసింది. ఈ ప్రచారకర్తల జాబితాలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేతలైన గులాం నబీ ఆజాద్, సల్మాన్ ఖుర్షీద్‌ ఉన్నారు.


కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నేత కన్హయ్య కుమార్ సహా మరో 30 మంది స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు దక్కింది. మరోవైపు.. బీజేపీ తరపున సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రచారం సాగిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున అఖిలేశ్‌ యాదవ్‌ పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నారు.

Read Also : Brendan Taylor : మ్యాచ్ ఫిక్సింగ్.. ఆ భారతీయ వ్యాపారవేత్త బెదిరించాడు.. బయటపెట్టిన మాజీ క్రికెటర్!