SHOCKING! : ఫోన్ మాట్లాడుతూ..మహిళకు రెండుసార్లు కరోనా టీకా ఇచ్చిన నర్సు
ఓ నర్సు కరోనా వ్యాక్సిన్ వేసే సమయంలో అత్యంత నిర్లక్ష్యం వహించిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఓ నర్సు ఫోన్ లో మాట్లాడుతూ మాటల్లో డి ఓ మహిళకు రెండు సార్లు కరోనా ఇంజెక్షన్ చేసిన ఘటన జరిగింది. అదే విషయాన్ని ప్రశ్నించగా సదరు మహిళపై ఆగ్రహంతో ఊగిపోతూ నిర్లక్ష్యంగా వ్యవహరించింది.

Corona Vaccination Big Negligence Nurse Woman Two Time Gave Two Vaccines
corona vaccination big negligence nurse woman two time gave two vaccines : ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయవద్దని పోలీసులు నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. కానీ దాన్ని పట్టించుకోని కొంతమంది ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కానీ డ్యూటీలో ఉన్న ఓ నర్సు ఫోన్ మాట్లాడుతూ ఓ మహిళకు కరోనా వ్యాక్సిన్ రెండు సార్లు ఇచ్చిన ఘటన చోటుచేసుకుంది యూపీలో. మరి దానికి ఫలితంగా సదరు మహిళ పరిస్థితి ఎలా ఉంటుందో గానీ.. డ్యూటీలో ఉండి కరోనా వ్యాక్సిన్ చేసే విషయంలో నర్సు నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.
యూపీ కాన్పూర్ లోని దేహాత్‌లో ఓ హాస్పిటల్ లో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. అక్కడికి వ్యాక్సిన్ వేయించుకోవటానికి కమలేష్ దేవి అనే మహిళ వచ్చింది. అయితే ఆమెకు నర్స్ ఫోన్ లో మాట్లాడుతూనే వ్యాక్సిన్ వేసింది. అలా ఫోన్ లో మాట్లాడుతూ..మాటల్లో పాడి కమలేష్ దేవికి మరోసారి ఇంజెక్షన్ వేసింది. అలా నర్సు ఫోనులో మాట్లాడుతూ ఆమె భుజంపై ఒకేచోట రెండుసార్లు వ్యాక్సిన్ ఇంజెక్షన వేసింది.
ఈ విషయాన్ని ఆ మహిళ గుర్తు చేయగానే..ఆ నర్సు అయ్యో..పొరపాటు జరిగింది..హా..ఏం కాదులే అంటూ తేలిగ్గా తీసి పారేసింది. కానీ కమలేష్ దేవి మరోసారి అడగటంతో సదరు నర్సు కోపంతో ఊగిపోతూ..ఇంజెక్షన్ ఇచ్చాక ఇక్కడే ఎందుకు కూర్చున్నావంటూ ఆగ్రహంతో ఊగిపోతూ..మాటల దాడికి దిగింది. అసలే ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే కొంతమందికి జ్వరం, తలనొప్పి వంటివి వస్తాయి. అటువంటిది రెండు డోసులు ఒకేసారి చేస్తే తన పరిస్థతి ఏమవుతుందోనని భయపడిపోయింది.
దాంతో అదే విషయాన్ని నర్సుకు చెప్పి రెండుసార్లు ఇంజెక్షన్ వేశావు..ఏమవుతుందో ఏమో అని అడిగితే ఏం కాదులే ఏమన్నా జరిగితే అప్పుడు చూద్దాం అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటంతో కమలేష్ దేవి మరోసారి అదే ప్రశ్నం వేసింది. దానికి ఆమె కోపంతో ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడటంతో కమలేష్ దేవి విషయాన్ని కుటుంబ సభ్యులు చెప్పటంతో నర్సు నిర్లక్ష్యంపై ఆమె బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా కమలేష్ దేవి మాట్లాడుతూ తనకు వ్యాక్సిన్ ఇచ్చిన నర్సు ఫోనులో ఎవరితోనే మాట్లాడుతూ తనకు వ్యాక్సిన్ ఇచ్చిందన్నారు. ఇంజెక్షన్ చేసిన తరువాత కాసేపు అక్కడే కూర్చోవాలని చెప్పటంతో తాను అక్కడే కూర్చున్నానని కానీ..ఆ నర్సు మరోసారి తనకు టీకా ఇచ్చిందన్నారు.దీంతో తాను రెండుసార్లు టీకా ఎందుకు ఇచ్చారని ప్రశ్నించగా, ఆమె కోపంతో ఊగిపోతూ వ్యాక్సిన్ వేశాక ఇంకా ఇక్కడ ఎందుకు కూర్చున్నావని ఎదురు ప్రశ్న వేసిందన్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఈ ఉదంతంపై దర్యాప్తునకు ఆదేశించారు.