‘ఆంటీ’ ఎంత పనిచేసింది?..అలా పిలిచిందని ఎలా చితకబాదేసిందో చూడండీ..!

up etah ‘aunt’ angry ; వయస్సుతో సంబంధం లేకుండా ‘ఆంటీ’ ‘అంకుల్’ అని పిలిచేయటం సర్వసాధారణంగా మారిపోయింది. కానీ చాలామందికి ఎవరన్నా అలా పిలిస్తే కోపం వస్తుంది. అలా ఓ మహిళ తనను ‘ఆంటీ’ అని పిలిచిన మరో యువతిపై ఆగ్రహంతో రగిలిపోయింది.
ఇష్టమొచ్చినట్లుగా తిట్టేస్తూ పాపం ఆ యువతిని చితకబాదేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎటాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే..యూపీలో త్వరలో జరగనున్న కరవా చౌత్ వేడుకకు సంబంధించిన పూజాసామగ్రి కొనుగోలుకు ఎటాలోని బాబూగంజ్ మార్కెట్‌కు మహిళలు భారీగా తరలివస్తున్నారు.
ఈక్రమంలో సోమవారం (నవంబర్ 2,2020) సాయంత్రం ఓ షాపులో మహిళల మధ్య గలాటా జరిగింది. షాపు దగ్గర పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు పలువురు మహిళలు నిలబడి ఉన్నారు. ఇంతలో ఒక యువతి పక్కనే ఉన్న ఓ మహిళను ‘ఆంటీ’ అని పిలిచి..కాస్త పక్కకు జరుగుతారా? అని అడిగింది.
అంతే..!! ఆ మహిళ కోపం నషాళానికి అంటింది. ఆగ్రహంతో ఊగిపోతూ, తన చేతిలో ఉన్న పూజా సామగ్రిని కింద పడేసి…‘ఆంటీ’అని యువతి జుట్టు పట్టుకుని పిడిగుద్దులు కురిపించింది.
దీంతో అక్కడు ఉన్న మహిళలు ఆశ్చర్యపోయారు. వారిని విడిపించటానికి యత్నించారు కానీ సాధ్యంకాలేదు.
సమీపంలో ఉన్న పోలీసులు ఈ గలాటాను గమనించి వారిద్దిరనీ అతి కష్టం మీద విడిపించటానికి నానా పాట్లు పడ్డారు. ఓ లేడీ కానిస్టేబుల్ ఇద్దరినీ అతి కష్టంమీద విడదీసింది. పోలీసులు వారిని ఎందుకు కొట్టుకుంటున్నారని ప్రశ్నించగా… ఆ యువతి తాను ఆమెను ‘ఆంటీ’ అని సంబోధించడంతోనే కొట్టారని భయపడుతూ చెప్పింది.
यूपी के एटा में आंटी कहने पर भड़की महिला, करवा चौथ की खरीददारी छोड़ बाल पकड़कर पीटा#UttarPradesh pic.twitter.com/yIr9werUzW
— Hindustan (@Live_Hindustan) November 3, 2020