రైల్వే టాయ్ లెట్లకు పార్టీ రంగులు ..మండిపడ్డ ఎస్పీ

UP : దేనికి పడితే దానికి రాజకీయ పార్టీల రంగులు వేయటం పెద్ద దుమారంగా మారిపోతోంది. కొన్ని పార్టీలు కావాలనే గ్రామ సచివాలయాల నుంచి శ్మశానాలకు కూడా తమ పార్టీ రంగులు వేసేస్తూ తెగ పబ్లిసిటీ చేసేసుకోవటం వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే. ఆ వివాదాలు న్యాయస్థానల వరకూ వెళ్లాయి ఆ వివాదాలు. కానీ ఉత్తరప్రదేశ్ లో మాత్రం తమ పార్టీ రంగులు రైల్వే హాస్పిటల్ లోని టాయ్ లెట్లకు వేయటంతో ఆ పార్టీ మండిపడింది. వెంటనే ఆ రంగుల్ని తొలగించాలని డిమాండ్ చేసింది. రాజకీయ దురుద్ధేశాలతో తమ పార్టీని అవమానించాలనే దురుద్ధేశంతో చేసిన ఈ పనిపై సదరు పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వివరాల్లోకి వెళితే..యూపీలోని గోరఖ్‌పూర్ జిల్లాలోని లలిత్ నారాయణ్ రైల్వే ఆసుపత్రి మరుగుదొడ్లకు ఎరుపు, ఆకుపచ్చ రంగులు వేయడంపై సమాజ్‌వాదీ పార్టీ మండిపడింది. తమ పార్టీ ఎరుపు, ఆకుపచ్చ రంగులను మరుగుదొడ్లకు వాడడం దారుణమని..వెంటనే ఆ రంగుల్ని తొలగించాలని డిమాండ్ చేసింది. దీంట్లో భాగంగా సమాజ్ వాద్ పార్టీ నేతలు గురువారం ( అక్టోబర్ 29,2020) రైల్వే అధికారులను కలిసిన వెంటనే రంగులను తొలగించాలని కోరారు.
https://10tv.in/assam-forest-department-arrested-seizes-two-elephant-killer-locomotive/
తమ పార్టీ రంగులను టాయిలెట్లకు వేయడం అధికారంలో ఉన్న బీజేపీ దిగజారుడుతనమని బీజేపీ పార్టీ కలుషిత మనస్తత్వానికి నిదర్శనమని సమాజ్‌వాదీ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ దురుద్దేశంతోనే ఈ పని కావాలనే చేశారని ఆరోపించింది.
యూపీలో కొంతకాలం అధికారం చేపట్టిన పార్టీపై కనీస గౌరవం కూడా లేకుండా అవమానకంగా ఇటువంటి పనులకు పాల్పడటం వారి మనస్తత్వానికి నిదర్శనమని..యూపీలో ప్రధాన పార్టీ రంగులను మరుగుదొడ్లకు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామనిజజ..రంగులు మార్చడమే కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది.
నాలుగు నెలల క్రితమే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ రెండు రోజుల క్రితమే రంగుల విషయం తమ దృష్టికి వచ్చిందని..దీంతో వెంటనే చర్యలను దిగామని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్ నాగిన సాహిని పేర్కొన్నారు.సమాజ్‌వాదీ పార్టీ ట్వీట్‌పై ఈశాన్య రైల్వే స్పందించింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా రైల్వే ఆసుపత్రిలో వేసిన టైల్స్ సంవత్సరాల నాటివని, మరుగుదొడ్లను మరింత పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతోనే వాటిని వేశామని..ఈ విషయంలో ఏ పార్టీకి సంబంధం లేదని..స్పష్టంచేసింది.
కాగా..స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా రైల్వే ఆసుపత్రిలో వేసామని తెలిసిన ఈశాన్య రైల్వే శాఖ వెంటనే సాయంత్రానికల్లా ఎరుపు, ఆకుపచ్చ రంగులు మార్చేసి తెలుపు రంగు వేయటం విశేషం. దీనిపై రైల్వే అధికారి ఒకరు వివరణ ఇస్తూ సమాజ్ వాద్ పార్టీ రంగులు అని చెప్పే టాయిలెట్ల గోడలపై ఎస్పీ కార్యకర్తలు నల్లరంగు పూసారనీ..అందుకే తాము తెలుపు రంగు వేయాల్సి వచ్చిందని తెలిపారు. రైల్వే శాఖ అధికారి చేసింది కేవలం ఆరోపణ మాత్రమేననీ తమ పార్టీ కార్యకర్తలు నల్లరంగు వేశారనటం సరికాదని అది వాస్తవం కాదని అంటూ ఎస్పీ గోరఖ్‌పూర్ మహానగర్ చీఫ్ ఈ ఆరోపణలను ఖండించారు.