Teacher Suspended : క్లాస్ రూమ్ లోనే విద్యార్థితో మసాజ్ చేయించుకున్న టీచర్..

క్లాస్ రూమ్ లో విద్యార్ధులకు పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ చిన్నపిల్లాడు అనికూడా చూడకుండా ఓ విద్యార్ధితో మసాజ్ చేయించుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వటంతో ఉన్నతాధికారులు టీచర్ ను సస్పెండ్ చేసారు.

Teacher Suspended : క్లాస్ రూమ్ లోనే విద్యార్థితో మసాజ్ చేయించుకున్న టీచర్..

Teacher Suspended Student Massaging

Updated On : July 28, 2022 / 2:35 PM IST

Teacher Suspended Student Massaging  : క్లాస్ రూమ్ లో విద్యార్ధులకు పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ చిన్నపిల్లాడు అనికూడా చూడకుండా ఓ విద్యార్ధితో మసాజ్ చేయించుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వటంతో ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు సదరు టీచర్ ను సస్పెండ్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

హ‌ర్దోయ్‌లోని పోఖ‌రి ప్రైమ‌రీ స్కూల్‌లో ఊర్మిళా సింగ్ అనే ఉపాధ్యాయురాలు విద్యార్థితో మ‌సాజ్ చేయించుకుంది. కూర్చీ మీద కూర్చున్న టీచ‌ర్ ఎడ‌మ చేతికి ఓ విద్యార్థి మ‌సాజ్ చేశాడు. క్లాస్‌రూమ్‌లోని మిగితా పిల్ల‌లు ఎవ‌రిప‌నిలో వారున్నారు. మ‌సాజ్ చేస్తున్న వీడియో ఎవరు తీసారో తెలీదు గానీ..దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది.పిల్ల‌వాడు చేతికి మ‌సాజ్ చేస్తుండ‌గా ఆ టీచ‌ర్ కూల్ గా బాటిల్‌తో నీళ్లు తాగుతోంది.ఈ వీడియోపై ప్రాథమిక విద్యాశాఖ అధికారి బీపి సింగ్ సీరియస్ అయ్యారు. టీచర్ ఊర్మిళా సింగ్ పై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.