Woman jumps into well: ఇద్దరు కుమారులతో కలిసి బావిలో దూకేసిన తల్లి
ఇద్దరు కుమారులతో కలిసి ఓ తల్లి (35) బావిలో దూకేసింది. ఈ ఘటనలో ఆమె చిన్న కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

fell into a bore well
Woman jumps into well: ఇద్దరు కుమారులతో కలిసి ఓ తల్లి (35) బావిలో దూకేసింది. ఈ ఘటనలో ఆమె చిన్న కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
ఆ మహిళ పేరు ప్రీతి అని పోలీసులు వివరించారు. ఆమె తన కుమారుడు అన్ష్ ప్రతాప్ (9), అభయ్ ప్రతాప్ (5) తో కలిసి బావిలో దూకిందని చెప్పారు. అయితే, ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వారిని బయటకు తీశారని, అప్పటికే అభయ్ ప్రతాప్ మృతి చెందాడని తెలిపారు.
అనంతరం ప్రీతితో పాటు ఆమె పెద్ద కుమారుడు అన్ష్ ప్రతాప్ ను ఆసుపత్రిలో చేర్పించిన స్థానికులు చికిత్స అందేలా చేశారని వివరించారు. ప్రీతి నివసిస్తున్న ప్రాంతంలో పొరుగింటి వారితో ఇటీవల గొడవ జరిగిందని పోలీసులు గుర్తించారు.
కొన్ని పాత్రలను ఎవరో చోరీ చేయడంతో ప్రీతికి, పొరుగింటి వారిని మధ్య గొడవ చెలరేగిందని, అనంతరం ఇదే విషయంలో ఆమె కుటుంబంలోనూ గొడవ చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. ఆయా కారణాల వల్లే ప్రీతి తన కుమారులతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.