Uttar Pradesh : కోడల్ని లైంగికంగా వేధిస్తున్న భర్త గొంతు కోసి హత్య చేసిన భార్య

కోడల్ని లైంగికంగా వేధిస్తున్న భర్తను గొడ్డలితో నరికి హత్య చేసింది అతని ఇల్లాలు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది.

Uttar Pradesh : కోడల్ని లైంగికంగా వేధిస్తున్న భర్త గొంతు కోసి హత్య చేసిన భార్య

UUttar Pradesh

Updated On : August 27, 2023 / 11:43 AM IST

Uttar Pradesh : కోడల్ని లైగింకంగా వేధిస్తున్న భర్తను దారుణంగా హతమార్చింది అతని భార్య. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది.

Assam : బీజేపీ ఎంపీ ఇంట్లో ఉరివేసుకున్న 10 ఏళ్ల బాలుడు.. ఆత్మహత్యకు కారణం ఏంటంటే?

యూపికి చెందిన ఏళ్ల మిథిలేష్ దేవి (40) తన భర్త తేజేందర్ సింగ్ (43) కోడల్ని లైంగికంగా వేధిస్తున్నాడని అతని గొంతు కోసి హతమార్చింది. అతను నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో అతని గొంతు కోసినట్లు పోలీసులు చెప్పారు. మొదట అతని హత్యను అనుమానాస్పద మృతిగా పోలీసులు భావించారు. మృతుని బంధువులు అతని మరణం వెనుక గుర్తు తెలియని వ్యక్తుల హస్తం ఉందని పోలీసులకు చెప్పారు. అయితే పోలీసుల విచారణలో మిథిలేష్ దేవి భర్త గొంతు కోసిందని తేలింది.

Assam : ఆ గ్రామంలో పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయి.. ఆ వింత గ్రామం ఎక్కడంటే?

మిథిలేష్ దేవి తన నేరాన్ని అంగీకరించింది. తనను భర్త తరచుగా కొడుతున్నాడని.. 19 సంవత్సరాల తన కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. తన కోడలితో తన భర్తకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతడిని హత్య చేసిందని చెబుతున్నారు. మిథిలేష్ దేవిని పోలీసులు అరెస్టు చేశారు.